న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారీగా కసరత్తులు చేస్తోన్న టీమిండియా

India vs West Indies 2018 : Virat Kohli, MS Dhoni Play Football In Training Ahead Of Guwahati ODI
Cricket Australia likely to grant India teams wish to play two practise matches

హైదరాబాద్: వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌పై దృష్టిసారించింది. టెస్టు సిరీస్ ఏకపక్షంగా సాగినప్పటికీ.. వన్డే సిరీస్‌లో భారత్‌కు కఠిన సవాల్ ఎదురుకానుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో విండీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడతారు. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

ఐదు వన్డేల సిరీస్‌లోనైనా పోటీనిస్తుందా

ఐదు వన్డేల సిరీస్‌లోనైనా పోటీనిస్తుందా

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 2-0తో సిరీస్‌ని చేజిక్కించుకుంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నెం.1 స్థానంలో కొనసాగుతున్న టీమిండియాకి ఏ దశలోనూ కరీబియన్ జట్టు పోటీనివ్వలేకపోయింది. కనీసం ఐదు వన్డేల సిరీస్‌లోనైనా పోటీనిస్తుందా..? అంటే సందేహమేనంటూ సమాధానాలు వినిపిస్తున్నాయి.

వెస్టిండీస్‌ జట్టుతో తొలి వన్డేను ఆదివారం

వెస్టిండీస్‌ జట్టుతో తొలి వన్డేను ఆదివారం

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌ జట్టుతో టీమిండియా తన తొలి వన్డేను ఆదివారం ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గువహటి చేసుకున్న భారత ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఆటగాళ్ల సాధనకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ధోని, కేఎల్‌ రాహుల్‌, ఉమేష్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ తదితరులు కసరత్తులు చేస్తూ కనిపించారు.

ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన ఫొటోలను బీసీసీఐ

వార్మప్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ పోస్ట్ చేసింది. ఆసియా కప్‌కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయబోతున్నాడు. క్రిస్‌గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, ఎవిన్ లూయిస్ లాంటి హిట్టర్లు జట్టులో లేకపోవడంతో వెస్టిండీస్ బలహీనంగా కనిపిస్తోంది. ఆదివారం నుంచే ఆ జట్టుతో ఐదు వన్డేల సిరీస్ ఆరంభంకాబోతోంది. ఆదివారం గువాహటిలో తొలి వన్డే జరగనుంది.

తొలి వన్డే కోసం భారత క్రికెటర్లు

తొలి వన్డే కోసం భారత క్రికెటర్లు

వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత క్రికెటర్లు.. శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలెట్టారు. ఆసియా కప్‌ తర్వాత విశ్రాంతి తీసుకున్న భారత మాజీ కెప్టెన్ ధోనీ.. కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ కేఎల్ రాహుల్, ఫాస్ట్ బౌలర్లు మొహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌తో కలిసి శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆదివారం మధ్యాహ్నం 1:30 నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.

Story first published: Saturday, October 20, 2018, 14:14 [IST]
Other articles published on Oct 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X