పంజాబ్ జట్టు క్రిస్ గేల్, మళ్లీ మొదలెట్టేశాడు

Posted By:
Chris Gayle Shows Off Bhangra Moves To Superhit Punjabi Song

హైదరాబాద్: ఐపీఎల్‌కు అందరు ఆటగాళ్లు తీవ్రంగా కసరత్తులు చేస్తూ ప్రాక్టీసులు చేస్తున్నారు. కానీ, క్రిస్ గేల్ మాత్రం ఫుల్ పార్టీ మూడ్‌లో మునిగిపోయాడు. అంతేకాదు, ఓ పంజాబీ పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ తన అధికారిక ఖాతా ద్వారా పోస్టు చేశాడు.

ఈ నేపథ్యంలో పంజాబీ స్టైల్‌లో అలరించేందుకు గేల్‌ సిద్దమవుతున్నాడు. ఓ పంజాబీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసిన వీడియోను 'భారత్‌కు వస్తున్నా.. పంజాబీ స్టైల్‌లో అలరిస్తా' అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది. ఐపీఎల్‌లో ఈసారి గేల్ కింగ్స్ పంజాబ్ టీమ్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. ఓ బోట్‌లో షికారు చేస్తున్న సమయంలో పంజాబీ సాంగ్‌కు భాంగ్రా స్టెప్పులేస్తూ గేల్ ఎంజాయ్ చేశాడు.

#KingGayle👑 coming, India. #LivePunjabiPlayPunjabi #Kings

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on Mar 31, 2018 at 2:35pm PDT

ఇప్పటి వరకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన గేల్‌ గత సీజన్‌లో విఫలమయ్యాడు. దీంతో ఏ ఫ్రాంచైజీ గేల్‌పై కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. ఈ సారి ఐపీఎల్ వేలంలో అతనిపై ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చివరిగా అతని కనీస ధర అయిన రూ.2 కోట్లకే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది.

ఈ మధ్యే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఆడిన గేల్.. మంచి ఫామ్‌లో ఉన్నాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 11 సిక్సులతో సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో అయితే అతనికి తిరుగులేని రికార్డుంది. మొత్తం 101 మ్యాచుల్లో 151 ైస్ట్రెక్‌రేట్‌తో 3626 రన్స్ చేశాడు. అందులో 5 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొదట కోల్‌కతాకు, తర్వాత బెంగళూరుకు, ఇప్పుడు కింగ్స్ పంజాబ్‌కు టీమ్‌కు గేల్ ఆడుతున్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 1, 2018, 17:15 [IST]
Other articles published on Apr 1, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి