న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌లో గేల్ ఔట్.. మూడు రికార్డులు లేనట్టే

Chris Gayle out for 7 runs, Brian Lara’s massive World Cup record is Safe

వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్, యూనివర్స్‌ బాస్ క్రిస్‌ గేల్‌కు ఇదే చివరి ప్రపంచకప్‌ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో వెస్టిండీస్‌ తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. క్రిస్‌ గేల్‌ తదుపరి ప్రపంచకప్ ఆడే అవకాశం లేకపోవడంతో.. ఆయనకు ఇదే చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌. అయితే చివరి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో వెస్టిండీస్‌ తరఫున గేల్‌ మూడు రికార్డులు బద్దలు కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆశలు ఆవిరయ్యాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రపంచకప్‌లో వరుసగా విఫలమవుతూ ఉన్న క్రిస్‌ గేల్‌ (7; 18 బంతుల్లో 1×4) ఈ మ్యాచ్‌లో కూడా పూర్తిగా నిరాశపరిచాడు. చివరి మ్యాచ్‌లోనూ స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్ దవ్లత్‌ వేసిన 5.3వ బంతిని ఆడబోయి కీపర్‌ ఇక్రమ్‌ అలీ ఖిల్‌కు చిక్కాడు. దీంతో క్రిస్‌ గేల్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు.

క్రిస్‌ గేల్‌ నిష్క్రమణతో ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ తరఫున స్టార్ దిగ్గజ ఆటగాడు బ్రియన్‌ లారా పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (1225), ప్రపంచకప్‌లో మూడు శతకాలు సాధించిన మరో విండీస్ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ రికార్డుకు డోకా లేకుండా పోయింది. వెస్టిండీస్‌ తరఫున లారా పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు మాత్రం బద్దలయ్యే అవకాశం ఉంది. గేల్‌ మరో సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఈ రికార్డు కనుమరుగవొచ్చు.

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ మైదానం వేదికగా ఆఫ్గనిస్థాన్, వెస్టిండీస్‌ జట్లు తలపడుతున్నాయి. వెస్టిండీస్‌ కెప్టెన్ జేసన్ హోల్డర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విండీస్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే క్రిస్‌ గేల్‌ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లకు విండీస్‌ ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో లూయిస్‌ (25), హోప్‌ (9)లు ఉన్నారు.

Story first published: Thursday, July 4, 2019, 16:02 [IST]
Other articles published on Jul 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X