న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రోజు సాయం చేయకుంటే రోహిత్ శర్మ అనేవాడు ఉండేవాడు కాదు

Childhood coach Dinesh Lad Says You wouldn’t have seen Rohit Sharma if he wasn’t granted freeship

ముంబై: టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌శర్మకు చిన్నతనంలో స్కూల్ ఫీజ్ కట్టేందుకు కూడా డబ్బులు లేవని అతని చిన్న నాటి కోచ్ దినేశ్ లాడ్ తెలిపారు. రోహిత్‌లోని ప్రతిభను గుర్తించిన తాను స్కూల్ డైరెక్టర్‌తో మాట్లాడి ఫ్రీగా చదువుకునేలా చేశానన్నారు. అలాంటి రోహిత్ భారత జట్టుకు ఆడుతాడని అస్సలు ఊహించలేదన్నారు. తాజాగా టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్‌ ఖేల్‌రత్న' సాధించడంపై సంతోషం వ్యక్తం చేసిన దినేశ్ లాడ్.. ఓ మరాఠీ క్రికెట్‌ చాట్‌షోలో హిట్ మ్యాన్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఓ పెదవాడికి..

ఓ పెదవాడికి..

‘రోహిత్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం సాధించడం గొప్ప విశేషం. ఒక పేదవాడికి అపార నైపుణ్యం ఉండి.. వచ్చిన అవాకాశాలను సద్వినియోగం చేసుకుంటే.. దానికి అదృష్టం కూడా కలిసి వస్తే.. అతనికి ఆకాశమే హద్దు. దానికి సరైన ఉదహారణ రోహిత్‌శర్మ. హిట్‌మ్యాన్‌ ఎంతో కష్టపడి, తన నైపుణ్యంతోనే పైకి వచ్చాడు. 2023లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ చెలరేగుతాడు. తనదైన ఆటతో భారత జట్టును విశ్వవిజేతగా నిలబెడతాడు.'అని దినేశ్ లాడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బౌలింగ్‌కు ఫిదా..

బౌలింగ్‌కు ఫిదా..

ఇక రోహిత్‌ను తొలిసారి చూసిన క్షణాలను కూడా గుర్తుచేసుకున్నారు. ‘రోహిత్‌ స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒకసారి బోరివాలీలో పాఠశాల స్థాయి క్రికెట్‌ టోర్నీ జరిగింది. అప్పుడు మా స్కూల్‌తో పాటు రోహిత్‌ చదివే స్కూల్‌ కూడా ఫైనల్‌కు చేరుకుంది. ఆ మ్యాచ్‌లోనే ఈ ముంబై క్రికెటర్‌ను తొలిసారి చూశాను. అతడి బౌలింగ్‌ చేసే విధానం చూసి ఫిదా అయ్యాను. దాంతో వేరే స్కూల్లో చదువుతున్న అతడిని మా పాఠశాల్లో చేరాలని రోహిత్ మామను కోరాను. కానీ మా స్కూల్ ఫీజు ఎక్కువగా ఉండటంతో అంత చెల్లించలేనని ఆయన నాతో అన్నారు.

ఫ్రీ సీటు ఇప్పించా..

ఫ్రీ సీటు ఇప్పించా..

చివరకు నేనే స్వయంగా మా స్కూల్‌ డైరెక్టర్‌తో మాట్లాడి ఫ్రీ అడ్మిషన్‌ ఇప్పించాను. ఆ రోజు నేను ఉచితంగా చేర్పించిన ఆటగాడు ఇప్పుడిలా భారత జట్టుకు ఆడుతాడని ఏమాత్రం ఊహించలేదు. నేను ఆ సహాయం చేయకపోతే ఇప్పుడు అందరూ చూస్తున్న రోహిత్‌ లేకపోయేవాడు. నేను అలా సాయం చేసిన మొదటి ఆటగాడు కూడా రోహితే.'అని దినేశ్ లాడ్ చెప్పుకొచ్చారు.

రఫ్ఫాడించిన రోహిత్..

రఫ్ఫాడించిన రోహిత్..

ఇక గతేడాది వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో అతను ఏకంగా ఐదు సెంచరీలను బాదాడు. ఆపై టెస్టుల్లోనూ ఓపెనర్‌గా శతకాలతో రెచ్చిపోయాడు. అలా 2019 మొత్తం భారత ఓపెనర్‌‌గా తన బ్యాటింగ్‌తో అలరించాడు. అలాగే ఐపీఎల్‌లోనూ తమ జట్టును నాలుగోసారి విజేతగా నిలిపాడు. దీంతో రోహిత్‌శర్మకు ఆ ఏడాది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అతడికి అత్యున్నత క్రీడా పురస్కారం ప్రకటించింది. అయితే ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్‌లో ఉన్న అతను ఆ అవార్డును ఇంకా స్వీకరించలేదు. స్వదేశానికి వచ్చిన తరువాత తీసుకుంటాడు.

Story first published: Sunday, August 30, 2020, 16:58 [IST]
Other articles published on Aug 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X