న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్ విడుదల!

IPL-2019 : BCCI To Announce Full Schedule In Next Few Days | Oneindia Telugu
Challenge before IPL to ensure 7 home games for teams

హైదరాబాద్: 2019 ఎన్నికల ఏడాది. దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను గత ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయనే దానిపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ కూడా ఐపీఎల్ 2019 సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ని ప్రకటించేందుకు సిద్ధమైంది.

<strong>పంత్‌లాగే ధోని కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో క్యాచ్‌లు వదిలేశాడు</strong>పంత్‌లాగే ధోని కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో క్యాచ్‌లు వదిలేశాడు

ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూసిన బీసీసీఐ ఫిబ్రవరిలో కేవలం తొలి 14 రోజుల మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ని మాత్రమే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే, సీఈసీ 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తేదీలను ప్రకటించడంతో... ఎన్నికలకి అనుగుణంగా భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీసీఐ కూడా ఐపీఎల్ తదుపరి షెడ్యూల్‌ని ప్రకటించేందుకు సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా.. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ప్రతి జట్టూ కనీసం ఏడు మ్యాచ్‌ల్ని సొంతగడ్డపై ఆడుతుంది. అయితే, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సొంతగడ్డపై ఏడు మ్యాచ్‌ల్ని ఆడే అవకాశాలు కనిపించడం లేదు.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఏప్రిల్ 11, 18, 23, 29, మే6, 12, 19 తేదీల్లో మొత్తంగా ఏడు రోజులు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఇబ్బంది ఎదురయ్యేలా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్‌ని ప్రకటిస్తామని ఎనిమిది ఫ్రాంఛైజీలకి తాజాగా బీసీసీఐ చెప్పినట్లు ముంబై మిర్రర్ ఒక కథనంలో పేర్కొంది.

Story first published: Tuesday, March 12, 2019, 15:41 [IST]
Other articles published on Mar 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X