న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ స్పిన్నర్లతో మమ్మల్ని పోల్చొద్దు: చాహల్ అసంతృప్తి

By Nageshwara Rao
 Chahal does not want comparisons of him and Kuldeep with Ashwin, Jadeja

హైదరాబాద్: వన్డేల్లో భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్. ఇటీవల కాలంలో సీనియర్ స్పిన్నర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

కొత్త రికార్డు: ధావన్ సెంచరీతో అగ్రస్థానంలోకి చేరిన భారత్కొత్త రికార్డు: ధావన్ సెంచరీతో అగ్రస్థానంలోకి చేరిన భారత్

ఈ క్రమంలో వీరిద్దరూ అశ్విన్, జడేజా స్ధానాలకు ఎసరపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా యజ్వేంద్ర చాహల్‌ స్పందించాడు. సీనియర్ స్పిన్నర్లు అయిన అశ్విన్, జడేజాలతో తమకు పోలిక తేవడం ఎంత మాత్రం సరైంది కాదని చాహల్ పేర్కొన్నాడు.

విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో మూడో వన్డే జరిగిన అనంతరం చాహల్ మీడియాతో మాట్లాడుతూ 'గత 5-6 ఏళ్ల నుంచి భారత క్రికెట్‌కు అశ్విన్, జడేజా ఎంతో సేవ చేశారు. మేమిద్దరం కేవలం నాలుగు-ఐదు సిరిస్‌ల్లో మాత్రమే ప్రాతినిథ్యం వహించాం. ఇటీవల కాలంలో మా ఇద్దర్ని అశ్విన్‌-జడేజాలతో పోల్చుతున్నారు. అది ఎంతమాత్రం కరెక్ట్‌ కాదు' అని అన్నాడు.

విశాఖ వన్డేలో ధావన్ సెంచరీ: 2-0తో సిరిస్ భారత్ కైవసంవిశాఖ వన్డేలో ధావన్ సెంచరీ: 2-0తో సిరిస్ భారత్ కైవసం

'మేము ఆడిన ఎక్కువ మ్యాచ్‌లు భారత్‌లోనే ఆడాం. భారత్‌ తరహా పిచ్‌లను పోలి ఉండే శ్రీలంకలో ఒక్క సిరీస్ మినహా మిగతా సిరీస్‌లు అన్ని భారత్‌లో ఆడినవే. మూడో వన్డేలో మాథ్యూస్ ఆడిన బంతిని నేను బాల్ ఆఫ్ ద మ్యాచ్‌గా పరిగణిస్తా' అని అన్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా పర్యటన గురించి ఎంతమాత్రం ఆలోచించడం లేదని అన్నాడు.

'మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే.. సాధ్యమైనంతవరకూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం. మేము ఎక్కువగా విదేశీ పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. టెస్టు క్రికెట్‌ ఆడటం అనేది ప్రతీ ఒక్కరి కల. గతేడాది రంజీ ట్రోఫీలు ఏడు మ్యాచ్‌లు ఆడాను. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది' అని చాహల్ అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 15:58 [IST]
Other articles published on Dec 18, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X