న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ దశాబ్దంలో 20వేల పరుగులు చేసిన కోహ్లీ.. పాంటింగ్‌ రికార్డును బద్దలు

Ind vs Wi 2019 : Kohli Is The First Man To Reach 20000 Runs In A Decade And Equals Sachin's Record
Captain Virat Kohli becomes first batsman to score 20,000 international runs in a decade

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: టీమిండియా కెప్టెన్‌ 'పరుగుల మెషీన్‌' విరాట్‌ కోహ్లీ గత 11 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ చేయలేదు. అర్ధ సెంచరీలు చేసినా.. సెంచరీలు మాత్రం చేయలేదు. ఎట్టకేలకు విండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కెరీర్‌లో 42వ సెంచరీ అందుకుని ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక మూడో వన్డేలో కూడా మరో సెంచరీ (114; 99 బంతుల్లో 14×4) చేసి పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. కోహ్లీకి ఇది వన్డేల్లో 43 సెంచరీ. దీంతో సచిన్‌ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డుకు మరింత చేరువ అయ్యాడు.

<strong>కోహ్లీని త్వరగా ఔట్‌ చేయాల్సింది.. ఫీల్డింగ్‌ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాం'</strong>కోహ్లీని త్వరగా ఔట్‌ చేయాల్సింది.. ఫీల్డింగ్‌ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాం'

ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు:

ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు:

విరాట్ కోహ్లీ పదేళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. ఈ దశాబ్దంలో 20,018 పరుగులు చేసిన కోహ్లీ.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పాంటింగ్‌ 18,962 పరుగులతో దశాబ్దంలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో జాక్వెస్ కలిస్‌ (16,777), మహేళ జయవర్ధనే (16,304), కుమార సంగక్కర (15,999)లు వరుసగా ఉన్నారు. సచిన్‌ టెందూల్కర్‌ (15,962) ఆరో స్థానంలో ఉన్నాడు.

రెండో కెప్టెన్‌గా:

రెండో కెప్టెన్‌గా:

వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. వన్డే కెప్టెన్‌గా కోహ్లీ 21 సెంచరీలు చేసాడు. రికీ పాంటింగ్‌ 22 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక విండీస్‌ పర్యటనలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కూడా కోహ్లీ ఘనత సాధించాడు. విండీస్‌ పర్యటనలో కోహ్లీకి ఇది నాలుగు వన్డే సెంచరీ. ఆసీస్ మాజీ ఓపెనర్ హేడెన్‌ మూడు శతకాలు చేసి ద్వితీయ స్థానంలో ఉన్నాడు.

సచిన్‌ సరసన:

సచిన్‌ సరసన:

ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా సచిన్‌ (9 ఆస్ట్రేలియాపై) సరసన కోహ్లీ (9 వెస్టిండీస్‌పై) చేరాడు. సచిన్‌ 43వ సెంచరీని 415 ఇన్నింగ్స్‌లో చేయగా.. కోహ్లీ 230 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. ఇక వన్డేల్లో వెస్టిండీస్‌లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాదిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2017లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ చేసాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో వరుసగా ఎండు సెంచరీలు చేసాడు.

కోహ్లీకి, భారత అభిమానులకు క్షమాపణలు చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్

ఐదో అగ్రస్థానంలో:

ఐదో అగ్రస్థానంలో:

వన్డేల్లో 50 పరుగుల కంటే అధికంగా ఎక్కువసార్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్‌ 463 వన్డేల్లో 145 సార్లు 50 పరుగులకు మించి చేసాడు. కోహ్లీ 239 మ్యాచుల్లోనే 97 సార్లు 50 పరుగులకు మించి సాధించాడు. ఈ ఏడాది వన్డేల్లో50 పరుగులకు మించి ఎక్కువ సార్లు స్కోరు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ (11) నిలిచాడు.

Story first published: Thursday, August 15, 2019, 15:30 [IST]
Other articles published on Aug 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X