కోహ్లీకి, భారత అభిమానులకు క్షమాపణలు చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్

జొహానెస్‌బర్గ్: కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోట్లాది భారత అభిమానులకు ఇటీవలే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ క్షమాపణలు తెలిపాడు. వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా సెలక్టర్లు తాజాగా జట్టును ప్రకటించారు. అయితే గాయం నుంచి కోలుకున్న స్టెయిన్‌ను మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో స్టెయిన్ సెలక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అందుబాటులోనే ఉన్నాఎంపిక చేయలేదు:
ఈ క్రమంలో దక్షిణాఫ్రికా రచయిత, క్రికెట్ విశ్లేషకుడు నీల్ మాంథోర్స్ ట్వీట్‌కు స్టెయిన్ స్పందించాడు. 'భారత్‌తో జరిగే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టును ఎంపిక చేశారు. పేసర్ క్రిస్ మోరిస్ అందుబాటులో ఉన్నట్లు సెలక్టర్లతో చెప్పలేదు' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్టెయిన్ బదులిస్తూ.. 'నేను అందుబాటులోనే ఉన్నా. అయినా నన్ను ఎంపిక చేయలేదు' అని సరదా పేర్కొన్నాడు.

అభిమానులకు క్షమాపణలు:
స్టెయిన్ ట్వీట్‌కు నీల్ మాంథోర్స్ స్పందించాడు. 'కీలక మ్యాచుల్లో ఆడించేందుకు నిన్ను ఎంపిక చేయలేదు అని అనుకుంటున్నా' అని బదులిచ్చాడు. దీనికి మల్లి స్టెయిన్ కూడా విన్నూతంగా రీట్వీట్ చేసాడు. 'విరాట్ కోహ్లీకి, కోట్లాది నా అభిమానులకు క్షమాపణలు' అంటూ పోస్ట్ చేశాడు. స్టెయిన్ రిటైర్మెంట్‌పై కోహ్లీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. బహుశా దానిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసి ఉంటాడు. మరోవైపు టెస్టు రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అతడి అభిమానులు కోరుతున్నారు.
వికాస్ విజృంభణ.. హరియాణా హ్యాట్రిక్

ఒక్క మ్యాచ్ ఆడకుండానే:
ఇటీవల జరిగిన ప్రపంచకప్‌నకు డేల్ స్టెయిన్ ఎంపికయ్యాడు. ఐపీఎల్-12 నుండే స్టెయిన్ భుజం గాయంతో సతమతమవుతున్నాడు. అయితే మెగా టోర్నీ సమయానికి గాయం తిరగబెట్టడంతో ఒక్క మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. స్టెయిన్ 93 టెస్టులు, 125 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 439, వన్డేల్లో 196, టీ20ల్లో 61 వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications