న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో బౌలర్: 400 వికెట్ల క్లబ్‌లో స్టువర్ట్ బ్రాడ్

By Nageshwara Rao
 Broad removes Latham to claim 400th Test wicket

హైదరాబాద్: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్కు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువార్ట్‌ బ్రాడ్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో నాలుగు వందల వికెట్లను సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డే-నైట్‌ టెస్టులో కివీస్‌ బ్యాట్‌మెన్‌ లాథమ్‌ వికెట్‌ సాధించడంతో బ్రాడ్‌ ఈ ఘనత సాధించాడు.

తన కెరీర్‌లో 115వ టెస్టులో బ్రాడ్ 400వ వికెట్‌ను తీసుకున్నాడు. 2007లో శ్రీలంకపై టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన బ్రాడ్‌ అతి తక్కువ సమయంలో ఇంగ్లాండ్ స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. కాగా, ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో జేమ్స్ అండర్సన్‌(524) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

మరో 17 వికెట్లు సాధిస్తే టీమిండియా వెటరన్ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ రికార్డును బ్రాడ్ సమం చేస్తాడు. టెస్టు క్రికెట్‌లో స్టువర్ట్ బ్రాడ్ అత్యుత్తమం 8-15. దీనిని 2015 యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా ట్రెండ్ బ్రిడ్జి వేదకగా జరిగిన నాలుగో టెస్టులో నమోదు చేశాడు. ఇదిలా ఉంటే ఆక్లాండ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులకే ఇంగ్లాండ్‌ ఆలౌటైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్ బౌల్ట్‌ ఆరు వికెట్లు తీశాడు.

Story first published: Thursday, March 22, 2018, 13:51 [IST]
Other articles published on Mar 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X