న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!

Border-Gavaskar Trophy: 4 Indian players who played in 2013 and will play in the upcoming BGT series

హైదరాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు సన్నదమవుతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్‌తో ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగేళ్ల తర్వాత భారత్ వేదికగా ఈ ట్రోఫీ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో 2013, 2018లో భారత్ వేదికగా ఈ ట్రోఫీ జరగగా రెండు సార్లు భారత్‌నే విజయం వరించింది. 2013లో అయితే మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 4-0తో ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేసింది.

ఈ చారిత్రాత్మక విజయాన్నందుకొని 10 ఏళ్లు పూర్తవ్వగా.. అప్పటి జట్టులో ఉన్న ఆటగాళ్లలో నలుగురు మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. ఇక అప్పటి చారిత్రాత్మక విజయంలో ఈ నలుగురు ఆటగాళ్లు కూడా కీలక పాత్ర పోషించారు. ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2013లో రవిచంద్రన్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అందుకున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 29 వికెట్లు తీసి సిరీస్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆస్ట్రేలియా పతనాన్ని అశ్విన్ శాసించాడు. ఈ సిరీస్‌లో అశ్విన్ 74 ఓవర్లు మెయిడిన్ చేయడం విశేషం.

అత్యుత్త బౌలింగ్ 7/103 కాగా.. బెస్ట్ మ్యాచ్ ఫిగర్స్ 12/198. అప్పుడు బ్యాటింగ్‌లో అశ్విన్ 20 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం అశ్విన్ బ్యాటింగ్‌లో కూడా చాలా మెరుగయ్యాడు. తాజా సిరీస్‌లోనూ అతను బంతితో పాటు బ్యాట్‌తోనూ కీలకం కానున్నాడు.

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2013లో భారత్ సాధించిన విజయంలో రవీంద్ర జడేజా కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నాలుగు మ్యాచ్‌ల్లో 17.45 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ ఆడేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడ్డారు. జడేజా ఎకానమీ 2.16 ఉండటమే ఇందుకు నిదర్శనం. ఇక అతను 53 ఓవర్లను మెయిడిన్ చేశాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకొని వస్తున్న జడేజా .. తాజా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

చతేశ్వర్ పుజారా..

చతేశ్వర్ పుజారా..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2013లో చతేశ్వర్ పుజారా కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 419 పరుగులు చేసింది. అతని బ్యాటింగ్ యావరేజ్ 83.80 కాగా.. అత్యధిక స్కోర్ 204. తాజా సిరీస్‌లోనూ అతను కీలకం కానున్నాడు. నయా ఇండియా వాల్‌గా పేరుగాంచిన పుజారా.. భారత ఇన్నింగ్స్‌కు వెన్నుముకగా నిలవనున్నాడు.

విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ..

2013 బోర్డర గవాస్కర్ ట్రోఫీలో విరాట్ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 284 పరుగులతో రాణించాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. బ్యాటింగ్ యావరేజ్ 56.50గా నమోదవ్వగా.. అత్యధిక స్కోర్ 107. ఇటీవల విరాట్ సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ అంటే విరాట్‌కు పండుగ. ఈ సిరీస్‌లో సెంచరీ బాది టెస్ట్ శతకాల నిరీక్షణకు తెరదించాలనుకుంటున్నాడు.

Story first published: Friday, February 3, 2023, 13:08 [IST]
Other articles published on Feb 3, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X