ట్విట్టర్‌లో అనుష్క శర్మ బికినీ ఫోటో..: ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

Virat Kohli Drops An Adorable Comment On Anushka Sharma's Latest Post || Oneindia Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా, వ్యక్తిగత జీవితంకు సంబంధించి ఏదైనా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. దీంతో అనుష్క సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలోనూ కోహ్లీ హవా.. సచిన్, ధోనీలను మించి ఫాలోవర్లు

 సన్ కిస్‌డ్ అండ్ బ్లెస్‌డ్:

సన్ కిస్‌డ్ అండ్ బ్లెస్‌డ్:

విరాట్ కోహ్లీతో వివాహం అనంతరం అనుష్క సినిమాలు తక్కువగా చేస్తూ.. భర్తతో కలిసి విదేశీ పర్యటనలకు వెళుతోంది. కోహ్లీ ఏ పర్యటనకు వెళ్లినా అనుష్క కూడా అక్కడ దర్శమిస్తోంది. ఈ క్రమంలో విండీస్ పర్యటనకు కూడా వెళ్ళింది అనుష్క. ప్రస్తుతం ఈ భామ కరేబియన్ దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. వివాహం అనంతరం అందాల ప్రదర్శనకు కాస్త దూరంగా ఉన్న అనుష్క... తాజాగా ఆంటిగ్వా బీచ్‌లో బికినీతో దిగిన ఫొటోను తన ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలలో పోస్ట్ చేసింది. 'సన్ కిస్‌డ్ అండ్ బ్లెస్‌డ్' అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కోహ్లీ కూడా 'ఫిదా':

అనుష్క షేర్ చేసిన బికినీ ఫొటో చూసి అభిమానులు మాత్రమే కాదు.. భర్త విరాట్ కోహ్లీ కూడా 'ఫిదా' అయ్యాడు. అయితే కోహ్లీ మాటల్లో కాకుండా తన మనసులోని భావాలను సింబల్స్ రూపంలో వ్యక్త పరిచాడు. హార్ట్ మరియు లవ్‌స్ట్రక్ ఎమోజీతో విరాట్ కోహ్లీ ట్వీట్ చేసాడు. కోహ్లీ చేసిన కామెంటుకు అతడి ఫ్యాన్స్ కూడా వేల సంఖ్యలో స్పందించారు. కోహ్లీది ఎంత మంచి మనసో అంటూ పలువురు ప్రశంసించారు.

మియామి వీధుల్లో సందడి:

మియామి వీధుల్లో సందడి:

క్రికెట్‌ మ్యాచ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే విరాట్ కోహ్లీ ఏ చిన్న సమయం దొరికినా భార్యతో కలిసి విహార యాత్రకు వెళతాడు. ఈ క్రమంలోనే విరుష్క జంట ఇటీవల అమెరికాలోని మియామీలో చక్కర్లు కొట్టింది. అక్కడ స్నేహితులతో కలిసి సరదా సమయం గడిపారు. ఓ హోటల్లో లంచ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. అనంతరం మియామి వీధుల్లోని అభిమానులతో విరుష్క జంట సందడి చేసింది. ముఖ్యంగా కోహ్లీ చిన్న పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసాడు. ప్రపంచకప్‌ సెమీస్ మ్యాచ్‌కు ముందు కూడా మాంచెస్ట‌ర్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టారు.

అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ మహ్మద్‌ షెజాద్‌పై ఏడాది నిషేధం

విరాట్‌తో ప్రేమలో:

విరాట్‌తో ప్రేమలో:

2017 డిసెంబరు 11న ఇటలీలోని ఖరీదైన విల్లాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నా.. ఇండియా వచ్చిన అనంతరం భారీ రిసెప్షన్ పెట్టి అందరినీ ఆహ్వానించారు. '29 సంవత్సరాలకే నేను పెళ్లి చేసుకున్నా. హీరోయిన్ ఈ వయసులో పెళ్లాడటం చాలా అరుదు. కానీ.. విరాట్‌తో ప్రేమలో ఉండటంతో పెళ్లి చేసుకున్నా' అని అనుష్క ఓ సందర్భంలో తెలిపింది.


For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 19, 2019, 14:11 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X