న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ మహ్మద్‌ షెజాద్‌పై ఏడాది నిషేధం

Afghanistan cricket Board suspends Mohammad Shahzad from all forms of cricket for One Year

కరాచి: అఫ్గానిస్థాన్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌, వికెట్ కీపర్ మహ్మద్‌ షెజాద్‌పై ఏడాది నిషేధం పడింది. అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డు (ఏసీబీ) నియమావళిని ఉల్లంఘించినందుకు మహ్మద్‌ షెజాద్‌పై ఏడాది నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ బోర్డు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు ఏసీబీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు షాజాద్ ఒప్పందంను రద్దు చేసింది. ఆదివారం అతని సస్పెన్షన్ వ్యవధిని కూడా నిర్ణయించింది. 12 నెలలు ఏ ఫార్మాట్‌ ఆడకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు అఫ్గాన్‌ బోర్డు తెలిపింది.

సోషల్ మీడియాలోనూ కోహ్లీ హవా.. సచిన్, ధోనీలను మించి ఫాలోవర్లు

'మహ్మద్‌ షాజాద్ ఇంతకుముందు ఏసీబీ క్రమశిక్షణా నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘించాడు. ఆటగాళ్ళ కోసం ఏసీబీ నియమించిన ప్రవర్తనా నియమావళికి అతడు కట్టుబడి లేడు. ఏసీబీ నియమాలను ఉల్లంఘిస్తూ షాజాద్ చాలాసార్లు ఇతర దేశాలు పర్యటించాడు. ఇక్కడ ఏసీబీకి మంచి శిక్షణ, ప్రాక్టీస్ సౌకర్యాలు ఉన్నాయి. ఆటగాళ్ళు ఎలాంటి ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్లవలసిన అవసరం లేదు' అని ఏసీబీ పేర్కొంది.

ప్రపంచకప్‌లో షెజాద్‌పై ఫిట్‌నెస్‌ కారణంతో బోర్డు వేటు వేసింది. అయితే తాను ఈ మెగా టోర్నీలో ఆడకుండా ఆప్ఘన్ క్రికెట్‌ బోర్డు కుట్ర పన్నిందని షెహజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'నన్ను ఎందుకు తొలగించారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. నేను ఫిట్‌గా ఉన్నప్పటికీ.. ఫిట్‌నెస్‌ సాకుతో నన్ను జట్టు నుంచి తప్పించారు. బోర్డులో కొంతమంది కలిసి నాపై కుట్ర పన్నారు. నా స్థానంలో వేరొకరిని జట్టులోకి తీసుకోనున్నారంటూ జట్టు మేనేజర్‌, డాక్టర్‌, కెప్టెన్‌కు ముందుగానే తెలుసు. ఇది నన్ను తీవ్రంగా కలిచి వేసింది' అని షెహజాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

ఫిరోజ్‌షా కోట్లలో 'విరాట్ కోహ్లీ' స్టాండ్‌!!

2017లో షెజాద్‌ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో ఐసీసీ అతనిపై ఏడాది సస్పెన్షన్ విధించింది. షాజాద్‌ బరువు తగ్గడానికి వాడుతున్న హైడ్రోక్సీకట్ మందులో క్లెనబుటరోల్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు పరీక్షలో తేలడంతో ఐసీసీ వేటు వేసింది. ఐసీసీ డోపింగ్ నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 2.1ను అతను ఉల్లంఘించినట్లు ఐసీసీ తేల్చింది.

Story first published: Monday, August 19, 2019, 13:11 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X