న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బేడీ Vs గంభీర్: షైనీకి వ్యతిరేకంగా రాసిన లేఖను బయటపెట్టాడు

Bishan Singh Bedi Tried To Get His Undeserving Son In Delhi Team : Gambhir || Oneindia Telugu
Bishan Singh Bedi tried to get his undeserving son in Delhi team: Gautam Gambhir

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌, మాజీ కెప్టెన్ బిషన్‌ సింగ్ బేడీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆదివారం వీరిద్దరూ ఒకరిపై మరొకరు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉంది.

The King of T20Is: విండిస్ పర్యటనలో రోహిత్ శర్మ రికార్డుల మోతThe King of T20Is: విండిస్ పర్యటనలో రోహిత్ శర్మ రికార్డుల మోత

ఈ పర్యటనలో భాగంగా ప్లోరిడా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో 26 ఏళ్ల టీమిండియా యువపేసర్‌ నవ్‌దీప్‌ సైనీ 3 వికెట్లు తీసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో నవదీప్ షైనీ ప్రదర్శనను మెచ్చుకుంటూ గంభీర్‌ తన ట్విట్టర్‌లో మాజీ క్రికెటర్లు బిషన్‌ సింగ్ బేడీ, చేతన్‌ చౌహాలను విమర్శిస్తూ ట్వీట్‌ చేశాడు.

రెండు వికెట్లు తీశావు

"నవ్‌దీప్‌ సైనీ.. నువ్వు బౌలింగ్‌ చేయడానికి ముందే రెండు వికెట్లు తీశావు. నీ ప్రదర్శనతో బిషన్‌సింగ్‌ బేడీ, చేతన్‌ చౌహాన్‌ మిడిల్‌ స్టంప్స్‌ ఎగిరి పడ్డాయి" అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు 2013లో షైనీ ఢిల్లీ రంజీ జట్టులో ఆడకుండా బిషన్ సింగ్ బేడీ అడ్డుకున్నాడని, షైనీకి వ్యతిరేకంగా లేఖ కూడా రాశాడని గంభీర్‌ పేర్కొన్నాడు.

గంభీర్ ట్వీట్‌పై బేడీ

గంభీర్ ట్వీట్‌పై బేడీ

గంభీర్ ట్వీట్‌పై బిషన్ సింగ్ బేడీ సైతం స్పందించాడు. "గంభీర్‌ ట్వీట్‌పై తానేమీ మాట్లడబోనని, ఎంపీ అయ్యాక కూడా అతడి ఆవేశం చల్లారలేదు" అని అన్నాడు. షైనీని అడ్డుకునే ప్రయత్నం తానెప్పుడూ చేయలేదని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఏ ఆటగాడైనా మంచి ప్రదర్శన చేస్తే అది వారి గొప్పతనమే అవుతుందని బేడీ తెలిపాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ.. స్మిత్ అరుదైన రికార్డు

షైనీకి వ్యతిరేకంగా లేఖ

అయితే, తాజాగా బేడీ వ్యాఖ్యలపై గంభీర్ సోమవారం మరోసారి ట్విట్టర్‌లో మండిపడ్డాడు. బేడీ అర్హత లేని తన కుమారుడిని ఢిల్లీ జట్టుకు ఆడించాలని చూశాడని గంభీర్ ట్వీట్ చేశాడు. 2013లో బిషన్‌ సింగ్ బేడీ... షైనీకి వ్యతిరేకంగా రాసిన లేఖకు సంబంధించి ఓ ఆర్టికల్ లింక్‌ను ట్వీట్ చేశాడు.

Story first published: Monday, August 5, 2019, 15:01 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X