న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: విజయానందంలో ఉన్న టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో ఆ స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

Big blow for Team India as injured Deepak Hooda likely to miss ICC T20 World Cup 2022

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో సిరీస్ విజయానందంలో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సన్నదమవుతున్న టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే జట్టు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన మహమ్మద్ షమీ కరోనా బారిన పడగా.. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా గాయపడినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడిన దీపక్ హుడా.. వెన్ను గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ గాయం కారణంగానే అతను ఆస్ట్రేలియాతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడని తెలిపింది.

వెన్ను గాయంతో..

వెన్ను గాయంతో..

'ఆస్ట్రేలియాతో మూడో టీ20 తుది జట్టు ఎంపికకు దీపక్ హుడా అందుబాటులో లేడు. అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు'అని బీసీసీఐ ట్వీట్ చేసింది. దాంతో అతను సౌతాఫ్రికాతో జరగనున్న అప్‌కమింగ్ మూడు టీ20ల సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికవ్వనీ భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలతో కలిసి దీపక్ హుడా బెంగళూరులోని ఎన్‌సీఏలో చేరినట్లు సమాచారం. దీపక్ హుడా గాయం పెద్దదైతే అతను టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరం కానున్నాడు. అదే జరిగితే టీమిండియాకు తీరని నష్టం జరగనుంది.

హార్దిక్ స్థానంలో..

హార్దిక్ స్థానంలో..

ఇన్నాళ్లు టీమ్ ప్రణాళికల్లో ఉన్న అతను ఉన్నపళంగా జట్టుకు దూరమయితే జట్టు కాంబినేషన్‌పై ప్రభావం చూపనుంది. ఆస్ట్రేలియాతో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా.. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో సౌతాఫ్రికాతో తుది జట్టులో ఆడే అవకాశం దక్కేది. కానీ వెన్ను గాయం అతన్ని జట్టుకు దూరం చేసింది. ఇక దీపక్ హుడా.. బ్యాటింగ్‌తో పాటు పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా రాణించగలడు. అతనికి రిప్లేస్‌మెంట్‌గా ఎవరిని తీసుకొస్తారో చూడాలి.

రఫ్ఫాడించిన సూర్య, కోహ్లీ

రఫ్ఫాడించిన సూర్య, కోహ్లీ

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), టీమ్ డేవిడ్(27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిర్సర్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. డానియల్ సామ్స్(28 నాటౌట్) కీలక పరుగులు చేశారు.

అనంతరం సూర్య, కోహ్లీ(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63) పాటు చివర్లో హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25 నాటౌట్) సత్తా చాటడంతో టీమిండియా 19.5 ఓవర్లలో 187/4 స్కోర్ చేసి విజయాన్నందుకుంది.

Story first published: Monday, September 26, 2022, 17:32 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X