న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: Rajasthan Royals ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బెన్ ‌స్టోక్స్ వచ్చేస్తున్నాడు!!

Ben Stokes to Join Rajasthan Royals Squad for IPL 2020 in UAE

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్‌ఆర్) ఫ్యాన్స్‌కు శుభవార్త. ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం న్యూజిలాండ్ నుంచి యూఏఈ బయలుదేరాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తండ్రితో సమయం గడపడానికి స్టోక్స్ గత ఆగస్టులో క్రైస్ట్‌చర్చ్‌కు వెళ్లాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు తర్వాత అతడు కివీస్ వెళ్లిపోయాడు. తన తండ్రి ఆరోగ్యం కుదుటపడంతో ఈ డ్యాషింగ్ ఆల్‌రౌండర్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరేందుకు దుబాయ్‌కి బయలు దేరాడు.

తన తండ్రి ఆరోగ్యం బాలేకపోవడంతో ఆగస్టులో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు తర్వాత బెన్ స్టోక్స్ న్యూజిలాండ్ బయలుదేరాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టులతో సహా ఆస్ట్రేలియాతో ముగిసిన పరిమిత ఓవర్ల పర్యటనను కూడా ఆడలేదు. తాజాగా క్రైస్ట్‌చర్చ్‌లో స్టోక్స్ శిక్షణ ప్రారంభించాడు. దీంతో ఐపీఎల్ 2020లో పాల్గొనబోతున్నా అని అతడు సూచనలు ఇచ్చాడు. ఇప్పడు రాయల్స్ జట్టులో చేరేందుకు దుబాయ్‌ కూడా బయలు దేరాడు.

కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ జట్టులో బెన్ స్టోక్స్ చేరుతాడనే వార్తలు వినిపించాయి. రాయల్స్ మెంటార్‌, ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్ ఈ విషయంపై ఇటీవలే చిన్న హింట్ ఇచ్చాడు. మంచి ఫామ్‌లో ఉన్న జట్టులో స్టోక్స్ ఎంట్రీ ఇస్తే ఆ జట్టు మరింత బలోపేతంగా తయారవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దుబాయ్‌కు చేరుకున్న వెంటనే స్టోక్స్ కోవిడ్-19 ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 36 గంటల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. స్టోక్స్ దుబాయ్‌కు చేరుకోగానే 36 గంటలు క్వారంటైన్‌లో ఉంటాడు. అయితే నిబంధనలు మాత్రం 6 రోజుల పాటు ఉండాలని సూచిస్తున్నాయి. ఈ సమయంలోనే మరోసారి కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తారు.

బెన్ స్టోక్స్ చేరికతో రాయల్స్ మిడిల్ ఆర్డర్ బలోపేతం అవుతుంది. ఇటు బౌలింగ్‌ విభాగం పటిష్టం అవ్వనుంది. ఇప్పటి వరకు రాయల్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండు గెలిచింది. స్టోక్స్ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా కనిపించింది. రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్‌లు జట్టులో చేరినప్పటికీ స్టోక్స్ లేని లోటును వీరు పూడ్చలేకపోయారు. ఇక బంతితో కూడా అద్భుతాలు చేయగల స్టోక్స్.. ప్రత్యర్థి జట్టును బంతితో కట్టడి చేయగల సత్తా ఉంది. మొత్తానికి దుబాయ్‌కు చేరుకోగానే ఒకటి రెండు మ్యాచ్‌లకు బెన్ స్టోక్స్ దూరమైనప్పటికీ.. అతని చేరికే జట్టుకు సగం బలం ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

RCB vs RR Preview: అభిమానులకు డబుల్‌ ధమాకా.. బెంగళూరు vs రాజస్థాన్‌.. మూడో విజయం ఎవరిది!!RCB vs RR Preview: అభిమానులకు డబుల్‌ ధమాకా.. బెంగళూరు vs రాజస్థాన్‌.. మూడో విజయం ఎవరిది!!

Story first published: Saturday, October 3, 2020, 14:44 [IST]
Other articles published on Oct 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X