న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతను హీరో కాదు.. పరువు తీశాడు'

Ben Stokes not a ‘hero’, he brought game into disrepute, says Michael Vaughan

ఇంగ్లాండ్: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్ చురకలంటించాడు. ఇంగ్లాండ్ టీమ్ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌.. 'స్టోక్స్‌ ఏం హీరో కాదని, అతడిని హీరోగా చిత్రీకరించే యత్నాలు చేయవద్దు' అని సూచించాడు. బీబీసీ మీడియాతో వాన్‌ మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు స్టోక్స్‌ కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అభిప్రాయపడ్డాడు వాన్‌. కాగా తొలి టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి సహా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు స్టోక్స్‌.

ఇటీవల కోర్డు వివాదంలో పలు వాయిదాలకు హాజరవుతున్న బెన్ స్టోక్స్‌ను అక్కడి మీడియా వెనకేస్తుండటాన్ని దుయ్యబట్టాడు. 'ఇంగ్లండ్‌ క్రికెట్‌ ప్రేమికులకు మనవి చేస్తున్నా. బెన్‌స్టోక్స్‌ను హీరోలా చూడవద్దు. డ్రెస్సింగ్‌ రూమ్‌ కూడా అతడి సాధారణ ఆటగాడిగానే చూస్తే మంచిది. అతడు ఆటను వివాదాల్లోకి లాగుతున్నాడు. విలన్‌గా ప్రవర్తిస్తూ స్టోక్స్‌ ఆటను భ్రష్టు పట్టిస్తున్నాడు. ఓవరాల్‌ ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌కు, తనను ప్రేమించే వారికి స్టోక్స్‌ ఎన్నో క్షమాపణలు చెప్పినా తక్కువే.'

ఇప్పుడైనా మారాలి:
'గత ఏడాదికాలం నుంచి జరిగిన విషయాలపై స్టోక్స్‌ శ్రద్ధ పెట్టాలి. కుటుంబాన్ని ఇరుకున పడేయకుండా.. జట్టుకు పేరు తెచ్చేలా నడుచుకుంటే ఆ ఆల్‌రౌండర్‌ కెరీర్‌కు మంచిది. అతడి ప్రవర్తన వల్ల 8 రోజులపాటు క్రౌన్‌ కోర్టుకు విచారణకు కావాల్సి వచ్చిందని గుర్తుంచుకోవాలని' స్టోక్స్‌ను ఉద్దేశించి మైఖెల్‌ వాన్‌ వ్యాఖ్యానించాడు.

కాగా, వీడియో ఆధారాలు, సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. పోలీసులు నమోదు చేసిన అఫ్రే (బహిరంగ ప్రదేశంలో ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా గొడవకు దిగడం) ఆరోపణల నుంచి స్టోక్స్‌కు విముక్తి కలిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్టోక్స్‌తో పాటు సహ నిందితుడిగా ఉన్న ర్యాన్‌ అలీని కూడా కోర్టు నిర్దోషిగా తేల్చగా, మూడో నిందితుడు ర్యాన్‌ హేల్‌ తప్పు చేయలేదని కోర్టు ఇంతకు ముందే ప్రకటించింది. అయితే ఇద్దరు 'గే' వ్యక్తులను రక్షించే ప్రయత్నంలోనే తాను జోక్యం చేసుకుని గొడవకు దిగాల్సి వచ్చిందని స్టోక్స్‌ వివరణ ఇవ్వగా కోర్టు అతనికి మినహాయింపునిచ్చింది.

Story first published: Thursday, August 16, 2018, 14:35 [IST]
Other articles published on Aug 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X