న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుర్రలేని షెడ్యూల్‌: భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్‌పై బీసీసీఐ

By Nageshwara Rao
Asia Cup 2018 Schedule: BCCI Wants India Vs Pak Match to be Rescheduled
BCCI wants change of schedule for India-Pakistan Asia Cup 2018 match: report

హైదరాబాద్: మంగళవారం విడుదల చేసిన ఆసియా కప్‌ షెడ్యూల్‌పై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ‍్యక్తం చేసింది. టోర్నీలో భాగంగా సెప్టెంబరు 19న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే షెడ్యూల్‌ను తయారు చేసిన తీరును బీసీసీఐ తప్పుపట్టింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా సెప్టెంబర్‌లో ఆసియాకప్‌ జరుగునున్న సంగతి తెలిసిందే. 'బుర్ర పెట్టే షెడ్యూల్‌ను సిద్ధం చేశారా?' అంటూ బీసీసీఐ మండి పడుతోంది. భారత్‌కు వరుసగా రెండు రోజులు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది, ఇది ఎలా సాధ్యమని ఓ బీసీసీఐ అధికారి అన్నారు.

షెడ్యూల్ ప్రకారం ముందు రోజు ఒక క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. మరో క్వాలిఫయర్‌ మ్యాచ్ ఆడనున్న పాక్‌కి మాత్రం భారత్‌తో మ్యాచ్‌ కోసం రెండు రోజులు విరామం లభిస్తోంది. ఇది గమనించిన బీసీసీఐ 'ప్రణాళిక సిద్ధం చేసేముందు కొంతైనా ముందూ వెనకా ఆలోచించరా' అంటూ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేసింది.

రేపటి మ్యాచ్‌కు వెంటనే ఎలా సిద్ధపడుతుంది?

రేపటి మ్యాచ్‌కు వెంటనే ఎలా సిద్ధపడుతుంది?

"ఈ రోజు మ్యాచ్‌ ఆడిన జట్టు రేపటి మ్యాచ్‌కు వెంటనే ఎలా సిద్ధపడుతుంది? అందులోనూ ఇదేమైనా సాధారణమైన మ్యాచా? భారత్‌- పాక్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌. పాక్‌కేమో రెండు రోజులు విరామం ఇచ్చారు. భారత్‌ మాత్రం ఎటువంటి విరామం లేకుండా మ్యాచ్‌కు సిద్ధపడాలా?, ఇది బుర్రలేని షెడ్యూల్‌. దీన్ని ఎంతమాత్రం అంగీకరించలేం. ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయాల్సిందే" అని బీసీసీఐ డిమాండ్‌ చేసింది.

ఆసియా కప్ టోర్నీలో రెండు గ్రూపులు

ఆసియా కప్ టోర్నీలో రెండు గ్రూపులు

ఆసియా కప్ టోర్నీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఇప్పటికే ఈ టోర్నీకి ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ అర్హత సాధించాయి. మరో స్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేషియా, హాంకాంగ్ తలపడనున్నాయి. ఆ ఒక్క స్థానం కోసం వీటిలో ఒక దేశం క్వాలిఫయర్‌ మ్యాచ్‌ల ద్వారా ఎంపికవ్వాలి. గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్, క్వాలిఫయర్ ఉంటాయి.

 19న పాకిస్థాన్‌ Vs భారత్

19న పాకిస్థాన్‌ Vs భారత్

గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. 18వ తేదీన క్వాలిఫయర్ జట్టుతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత రోజే 19న మళ్లీ పాకిస్థాన్‌తో భారత్ ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరో వైపు 16వ తేదీన క్వాలిఫయర్ టీమ్‌తో ఆడిన పాక్.. రెండు రోజుల గ్యాప్ తీసుకుని భారత్‌తో తలపడుతుంది. దీంతో షెడ్యూల్ సరిగా లేదని బీసీసీఐ ఆరోపిస్తోంది. రెండు గ్రూపుల నుంచి టాప్-2 టీమ్స్ సూపర్ 4కు క్వాలిఫై అవుతాయి. ఈ ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.

ఆసియా కప్ షెడ్యూల్:

ఆసియా కప్ షెడ్యూల్:

గ్రూప్ స్టేజి:

15 September - Bangladesh vs Sri Lanka (Dubai)

16 September - Pakistan vs Qualifier (Dubai)

17 September - Sri Lanka vs Afghanistan (Abu Dhabi)

18 September - India vs Qualifier (Dubai)

19 September - India vs Pakistan (Dubai)

20 September - Bangladesh vs Afghanistan (Abu Dhabi)

సూపర్ 4

21 September - Group A Winner vs Group B Runner-up (Dubai)

21 September - Group B Winner vs Group A Runner-up (Abu Dhabi)

23 September - Group A Winner vs Group A Runner-up (Dubai)

23 September - Group B Winner vs Group B Runner-up (Abu Dhabi)

25 September - Group A Winner vs Group B Winner (Dubai)

26 September - Group A Runner-up vs Group B Runner-up (Abu Dhabi)

ఆసియా కప్ ఫైనల్ - 28 September (దుబాయి)

Story first published: Thursday, July 26, 2018, 16:33 [IST]
Other articles published on Jul 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X