|
ఇప్పుడు ఎందుకు..?
రోహిత్ శర్మ, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ గాయాలతో స్వదేశం పయనం కాగా.. కుల్దీప్ యాదవ్‌ను మూడో వన్డే కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే నామమాత్రపు చివరి వన్డేకు కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనకు కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసి ఒక్క మ్యాచ్ కూడా అవకాశం ఇవ్వని కుల్దీప్ యాదవ్‌ను బంగ్లాదేశ్ పర్యటనకు ఎందుకు పక్కనపెట్టారని నిలదీస్తున్నారు.
|
ఆ ముగ్గురిలో ఒక్కరున్నా..
స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటు ఈ సిరీస్‌లో స్పష్టంగా కనిపించింది. బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ అల్ హసన్ భారత బ్యాటర్లు ఇబ్బంది పెడితే.. టీమిండియా మాత్రం స్పెషలిస్ట్ స్పిన్నర్లు లేక మిడిల్ ఓవర్లలో దారళంగా పరుగులిచ్చింది. ఆరంభంలో పేసర్లు చెలరేగినా.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ రాణించినా.. అతనికి మరో ఎండ్‌లో సహకారం లభించలేదు. షెహ్‌బాజ్ అహ్మద్, అక్షర్ పటేల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. సుందర్‌కు తోడుగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌లలో ఏ ఒక్కరు ఉన్నా.. భారత్ విజయాలందుకునేది. రెండో వన్డేలో 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. టీమిండియాలో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడంతో 272 పరుగుల భారీ స్కోర్ చేసింది.
|
ఏం క్రికెట్ ఆడారని రెస్ట్..?
తొలి వన్డేలోనూ.. వేగంగా 9 వికెట్లు తీసిన భారత్ చివరి వికెట్ తీయలేక 51 పరుగులు సమర్పించుకొని ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ ఎంపిక ఆలస్యమైందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుల్దీప్ రాకతో మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించడం ఖాయమని, అయితే ఈ విజయం ఉపయోగం లేనిదని మండిపడుతున్నారు. అసలు యుజ్వేంద్ర చాహల్ ఏం క్రికెట్ ఆడాడని అతనికి రెస్ట్ ఇచ్చారని, రవి బిష్ణోయ్‌ను ఎందుకు విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కోసం అక్షర్ పటేల్, షెహ్‌బాజ్‌లను ఎంపిక చేసినా..వాళ్లు బౌలింగ్‌లో తేలిపోయారని కామెంట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవడం వల్లే భారత్‌కు ఈ గతి పట్టిందంటున్నారు.