న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand చివరి టీ20కి వరల్డ్ కప్ విజేతలు!

BCCI to felicitate India U-19 Womens team ahead of IND vs NZ 3rd T20I

న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్‌లో కొత్త పొద్దు పొడిచింది. సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను భారత బాలికల జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించించిన షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు.. తమ విజయంతో దేశ మహిళా క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మహిళా క్రికెట్‌లో ఏ స్థాయిలోనైనా భారత్ గెలిచిన తొలి ప్రపంచకప్ ఇదే కావడంతో అమ్మాయిలపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా బాలికల విజయాన్ని ప్రశంసించింది. జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్లు నజరానాగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రపంచకప్ గెలిచిన భారత బాలికలను ప్రత్యేకంగా సత్కరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది.
భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ ముందు అండర్ - 19 మహిళల ప్రపంచకప్‌ విజేతలను సత్కరిస్తామని బీసీసీఐ వెల్లడించింది.

BCCI to felicitate India U-19 Womens team ahead of IND vs NZ 3rd T20I

ఇవాళ సౌతాఫ్రికా నుంచి ముంబైకి భారత మహిళల అండర్ -19 జట్టు చేరుకొంటుంది. 'అండర్ -19 మహిళల ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ జట్టు సభ్యులకు సచిన్‌ టెండూల్కర్, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్స్‌ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 1 సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది'అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

BCCI to felicitate India U-19 Womens team ahead of IND vs NZ 3rd T20I

బీసీసీఐ సత్కారం ముగిసిన తర్వాత క్రికెటర్లు వారి సొంత ఇంటికి బయల్దేరతారు. ఇక అండర్ - 19 ప్రపంచకప్ ఫైనల్ లో తొలుత ఇంగ్లాండ్ ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. తర్వాత లక్ష్యాన్ని 14 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

Story first published: Tuesday, January 31, 2023, 16:54 [IST]
Other articles published on Jan 31, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X