న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మీరు క్రికెట్ కోసం వెళ్లారు.. సెల్ఫీలు ఇవ్వడానికి కాదు, ప్లేయర్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్

 BCCI Strictly Adviced Players to stay at Hotel, and Avoid Public Appearences and Selfies

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్లేయర్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న ఆటగాళ్లు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదని, తమ హ్యాంగ్‌అవుట్‌లను పరిమితం చేసుకుని తమకు కేటాయించిన హోటల్లోనే బస చేయాలని స్పష్టం చేసింది. ఇక శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) తర్వాత భారత బ్యాటర్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ అని తేలడంతో లీసెస్టర్‌షైర్‌తో జరిగిన నాలుగు రోజుల వార్మప్ గేమ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగకుండానే రోహిత్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు. ఇంగ్లాండ్‌లో బయో బబుల్, ఐసోలేషన్ తదితర నిబంధనలు ఎత్తివేసినప్పటికీ.. ఇంకా కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక వైరస్ బారిన పడకుండా ప్లేయర్లు తమను తాము కాపాడుకోలేకపోతున్నారు. ఇటీవల అక్కడ న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.

ఫోటోలు దిగడం బంద్ చేయాలి

ఫోటోలు దిగడం బంద్ చేయాలి

బీసీసీఐకి సంబంధించిన ఓ సోర్స్ ANIతో ఆటగాళ్లకు విధించిన నిబంధనల గురించి ఇలా చెప్పాడు. 'ఇంగ్లాండ్ పర్యటనలో కొంతమంది ఆటగాళ్లు బహిరంగంగా తిరుగుతున్నారని, వారు తమ అలవాటును మార్చుకోవాలని హెచ్చరించాం. కొంతమంది ప్లేయర్లు పబ్లిక్‌గా వెళ్లి అభిమానులతో ఫొటోలు దిగడం కోవిడ్ వ్యాప్తికి కారణమవుతుందని, అందువల్ల ప్లేయర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పాం. వారు బస చేసిన నగరంలో అవసరం లేకున్నా పలు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కాబట్టి మేము వారిని తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే సూచించాం' అని పేర్కొన్నాడు.

ఇటీవల కోహ్లీ, రోహిత్, పంత్..

ఇటీవల కోహ్లీ, రోహిత్, పంత్..

ఇక టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన ఫోటోలు వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. వారు తమ అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నట్లు ఆ చిత్రాల్లో కన్పించింది. ఇక ఇటీవల వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సైతం కొంతమంది పిల్లలు వచ్చి ఆటోగ్రాఫ్, ఫోటోలు అడిగేసరికి తాను కూడా ఆటోగ్రాఫ్స్ ఇచ్చి వారి సమూహంతో పాటు ఫోటోలు దిగాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ప్లేయర్లు పబ్లిక్‌తో దూరంగా ఉండాలి. కానీ ఆటగాళ్లు రూల్స్ మర్చిపోతున్నారు.

జులై 1న రీషెడ్యూల్ టెస్ట్ ప్రారంభం

జులై 1న రీషెడ్యూల్ టెస్ట్ ప్రారంభం

లీసెస్టర్‌షైర్‌తో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక జులై 1న బర్మింగ్ హమ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభమయ్యే రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్టు కోసం భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. రీషెడ్యూల్ చేయబడిన ఈ ఐదవ టెస్ట్ ఇంగ్లాండ్‌లో 2021లో జరిగిన భారత సిరీస్‌లో ఐదవ మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. ఇప్పటికే ఈ సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అప్పట్లో భారత శిబిరలంలో కోవిడ్-19 కేసులు వెలుగు చూడడంతో చివరి నిమిషంలో ఐదో టెస్టు వాయిదా పడింది.

Story first published: Tuesday, June 28, 2022, 7:42 [IST]
Other articles published on Jun 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X