కేవలం ఐపీఎల్ నుంచే రూ. 2000 కోట్లు ఆర్జించనున్న బీసీసీఐ

Posted By: Subhan
BCCI set to earn over Rs 2000 crore from IPL

హైదరాబాద్: 2008వ సంవత్సరం సాధారణ ట్రోఫీగా మొదలైన ఐపీఎల్ సీజన్ దశాబ్ధ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని చివరికి బీసీసీఐకి 95శాతం ఆధాయం తెచ్చిపెట్టే వనరుగా మారింది.

బీసీసీఐకు అంతర్జాతీయ క్రికెట్‌లో వచ్చే ఆదాయం రూ. 125కోట్లుగా ఉంటే కేవలం ఐపీఎల్ సీజన్‌కు రూ 2,107కోట్లను సొంతం చేసుకుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఓ సంవత్సర కాలంలో 320 రోజుల ఆదాయం కేవలం 45 రోజుల్లో బీసీసీఐకు తెచ్చి పెడుతుంది.

ఐపీఎల్ సీజన్‌కు గాను రూ. 1,272 కోట్లను అన్ని రకాల పెట్టుబడులు కలిపి బీసీసీఐ ఖర్చు చేస్తోంది. దీనికి బదులుగా రూ. 3413 కోట్ల రూపాయలు ఆధాయాన్ని తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ రకంగా చూస్తే పాత లెక్కల ప్రకారం.. అంతర్జాతీయ, జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల నుంచి వచ్చే (ఐపీఎల్ : బీసీసీఐ) ఆధాయం (52:48) గా ఉంటే కొత్తగా 80:20 గా పెరిగింది.

భారత క్రికెట్‌కు మంచి ఆధాయ వనరుగా మారిన ఐపీఎల్ ప్రసార హక్కులు భారీగా అమ్ముడుపోయాయి. స్టార్ ఇండియాతో ఐదు సంవత్సరాల వరకు రూ. 16347కోట్లకు ఒప్పందం చేసుకుంది. కానీ, కేవలం భారత్ వన్డే, టీ 20 ప్రసార హక్కులకు రూ. 43.20కోట్లు మాత్రమే సొంతం చేసుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, February 13, 2018, 12:19 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి