న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ మరోసారి వాయిదా.. ఇక కొత్త షెడ్యూల్ అప్పుడేనా‌?

BCCI plans to clear August-September window to hold IPL 2020
IPL 2020 : BCCI Plans To Schedule August-September Window For IPL

ముంబై: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ ​లీగ్ ​(ఐపీఎల్​) 13వ సీజన్​ సందిగ్ధంలో పడింది. మార్చి 29 నుంచి ఏప్రిల్​ 15కు వాయిదా పడినా.. దేశంలో లాక్​డౌన్ నేపథ్యంలో ఈ తేదీన ప్రారంభమయ్యే అవకాశం లేదు. మహమ్మారి తీవ్రత పెరుగుతుండడంతో.. ఐపీఎల్‌ను మరోసారి వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే అన్ని కుదిరితే ఐపీఎల్‌ను ఆగస్టు-సెప్టెంబర్‌లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

అతనితో డేటింగ్‌లో ఉన్నా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా: గుత్తా జ్వాలఅతనితో డేటింగ్‌లో ఉన్నా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా: గుత్తా జ్వాల

ఆగస్టు-సెప్టెంబర్‌లో లీగ్?:

ఆగస్టు-సెప్టెంబర్‌లో లీగ్?:

'ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. ఫ్రాంచైజీలతో మాట్లాడుతున్నాం. అందరి ఆరోగ్యమే ముఖ్యం. కరోనా పరిస్థితులపై అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం. ఆగస్టు-సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్నాం. అయితే ఆ సమయంలో కొన్ని టోర్నీలు ఉన్నాయి' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఆసియా కప్‌ అడ్డంకి:

ఆసియా కప్‌ అడ్డంకి:

సెప్టెంబర్‌లో భారత్‌ ఆసియా కప్‌ ఆడాల్సి ఉంది. మరోవైపు ఆగస్టు-సెప్టెంబర్‌లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాలి. టీ20 ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాలో మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఇదే సమయంలో ఇంగ్లాండ్‌ సొంతగడ్డపై పాకిస్థాన్, ఐర్లాండ్‌తో సిరీస్‌ ఆడనుంది. ఇక వెస్టిండీస్ పర్యటనకు దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంది. ఐపీఎల్‌కు ఇవన్ని అడ్డంకిగా మారకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ సంప్రదింపులు చేయాలి. ఇక ఆసియా కప్‌ను కూడా తర్వాత నిర్వహించాలని కోరాలి.

బ్రాడ్‌కాస్టర్‌తోనూ చర్చించాలి:

బ్రాడ్‌కాస్టర్‌తోనూ చర్చించాలి:

బ్రాడ్‌కాస్టర్‌తోనూ బీసీసీఐ చర్చించాల్సి ఉంది. ఆసియాకప్, ఐపీఎల్‌కు స్టార్‌ స్పోర్ట్సే బ్రాడ్‌కాస్టర్‌ కాబట్టి దీనిపై పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఐపీఎల్‌ను కాదని ఆసియా కప్‌కు మొగ్గుచూపితే.. స్టార్‌ స్పోర్ట్స్‌ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. వీటన్నింటి కంటే ఐపీఎల్ షెడ్యూల్‌లో మ్యాచ్‌ వేదికలను నిర్వహకులు జాగ్రత్తగా నిర్వహించాలి. ఆగస్టు-సెప్టెంబర్‌లో వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సరైన మ్యాచ్‌ వేదికలను ఖరారు చేయాల్సిన అవసరం ఉంది.

Story first published: Wednesday, April 1, 2020, 9:57 [IST]
Other articles published on Apr 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X