శుభవార్త: ఆల్ ఇండియా రేడియాలో కోహ్లీసేన మ్యాచ్‌ల కామెంటేటరీ

హైదరాబాద్: క్రికెట్ ప్రియులకు నిజంగా ఇది శుభవార్త. టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌ని వీక్షించలేనటువంటి క్రికెట్ అభిమానుల కోసం బీసీసీఐ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. లైవ్ కామెంటేటరీ కోసం అల్ ఇండియా రేడియోతో బీసీసీఐ రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.

ఆల్ ఇండియా రేడియోలో లైవ్ కామెంటేటరీ
ఈ ఒప్పందంలో భాగంగా ఇకపై కోహ్లీసేన ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు స్వదేశంలో జరిగే దేశవాళీ టోర్నీలకు సంబంధించి లైవ్ కామెంటేటరీని క్రికెట్ అభిమానులకు అందించనుంది. ఈ చొరవ భారతదేశం అంతటా ఉన్న మిలియన్ల మంది క్రికెట్ అభిమానులు లైవ్ రేడియో కామెంటేటరీని అనుసరించే అవకాశాన్ని కల్పిస్తుంది.
మూడో టెస్టులో హీరో... నాలుగో టెస్టుకు జీరో: లీచ్ ప్రదర్శనపై పీటర్సన్

సెప్టెంబర్ 15 నుంచి
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ అవకాశం అందుబాటులోకి రానుంది. త్వరలో సఫారీ జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

తొలుత మూడు టీ20ల సిరిస్
తొలుత మూడు టీ20ల సిరిస్ జరుగుతుండగా.. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. టీ20 సిరిస్‌కు ధర్మశాల, మొహాలి(సెప్టెంబర్ 18), బెంగళూరు(సెప్టెంబర్ 22) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టుకు విశాఖపట్నం(అక్టోబర్ 2-6) ఆతిథ్యమిస్తోంది.
మరింత పదిలం: టెస్టు ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్‌ను అందుకునే వాడే లేడా?

రెండేళ్ల ఒప్పందం
ఆ తర్వాత పుణె(అక్టోబర్ 10-14), రాంచీ(అక్టోబర్ 19-23) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు పురుషుల, మహిళల దేశవాళీ మ్యాచ్‌లను కూడా ఆల్ ఇండియా రేడియో లైవ్ కామెంటెటరీ ఇవ్వనుంది. బీసీసీఐతో ఆల్ ఇండియా రెండేళ్ల ఒప్పందం సెప్టెంబర్ 10, 2019 నుంచి ఆగస్టు 31, 2021 వరకు ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications