Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో టెస్టులో హీరో... నాలుగో టెస్టుకు జీరో: లీచ్ ప్రదర్శనపై పీటర్సన్

Jack Leach is becoming a laughing stock: Kevin Pietersen not impressed with England spinner

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ ప్రదర్శన తనను ఏమాత్రం ఆకట్టుకోలేదని మాజీ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ వెల్లడించాడు. ప్రధాన స్పిన్ బౌలర్‌గా అతడు తన విధులను నిర్వర్తించలేదని అన్నాడు. ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ విజయంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలవడంతో పాటు యాషెస్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది. హెడెంగ్లే వేదికగా జరిగిన మూడో టెస్టులో జాక్ లీచ్ ఒక పరుగు చేసినప్పటికీ అతడు సూపర్ స్టార్ అయ్యాడు. ఆఖరి వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి టెస్టులో ఓడినప్పటికీ... మూడో టెస్టులో విజయం సాధించడంతో ఇంగ్లాండ్ మళ్లీ యాషెస్ రేసులోకి వచ్చింది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. నాలుగో టెస్టులో జాక్ లీచ్ ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. ఈ నేఫథ్యంలో జాక్ లీచ్ ప్రదర్శనపై కెవిన్ పీటర్సన్ స్పందించాడు.

"ఇంగ్లాండ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాల్సిన వ్యక్తి ఓ జోక్‌గా మిగిలాడు. మార్కులు, నకిలీ కళ్ల జోళ్లను ధరించి స్టాండ్లలో ఉన్న వ్యక్తులను మీరు చూసే ఉంటారు. కామెంటేటర్లు సైతం వారి గురించి మాట్లాడుతున్నారు. ఇంగ్లాండ్ యాషెస్ సిరిస్‌ను చేజార్చుకోవడానికి కారణం, మూడు టెస్టు మ్యాచ్‌ల్లో అతడు ఎనిమిది వికెట్లు తీయడమే" అని పీటర్సన్ అన్నాడు.

"అతడి బౌలింగ్‌తో ఎవరిని ఇబ్బంది పెట్టినట్లు కనిపించలేదు. ఈ పనులు చేయవద్దని నేను చెప్పడం లేదు. టీమ్‌లో గెలవాలనే పట్టుదల ఉండాలి. నేను గెలవాలని కోరుకుంటున్నాను. అంతే తప్ప మైదానంలోని ప్రేక్షకులు అతడు ఫన్నీ ఆటగాడు అని మాట్లాడుకోవడం నేను చూడదలచుకోలేదు. అతడి బౌలింగ్‌లో ఇంగ్లాండ్ మ్యాచ్‌లు గెలవడాన్ని నేను చూడాలనుకుంటున్నాను" అని లీచ్‌ను ఉద్దేశించిన పీటర్సన్ అన్నాడు.

ఈ యాషెస్ సిరిస్‌లో ఓపెనర్ జేసన్ రాయ్ ప్రదర్శనపై కూడా పీటరన్ విమర్శించాడు. అతడో అద్భుతమైన ప్లేయర్, అయితే, తన టెక్నిక్‌ను మార్చుకుంటేనే అతడొక గొప్ప టెస్టు ఆటగాడు అవుతాడని జేసన్ రాయ్‌కు పీటర్సన్ ఓ సూచన చేశాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఆఖరి టెస్టు ఓవల్ వేదికగా సెప్టెంబర్ 12న ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, September 10, 2019, 17:02 [IST]
Other articles published on Sep 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+