న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర్జున అవార్డుకి ఇద్దరి మహిళా క్రికెటర్లను నామినేట్ చేసిన బీసీసీఐ!

BCCI likely to recommend Shikha Pandey, Deepti Sharma for Arjuna Awards

న్యూఢిల్లీ: ప్రతీష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డుకి ఇద్దరి మహిళా క్రికెటర్ల పేర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) నామినేట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నిలకడగా రాణించిన భారత మహిళా క్రికెటర్లు శిఖా పాండే, దీప్తి శర్మలను బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్ టీమ్ సిఫార్సు చేయాలనుకుంటున్నట్లు ప్రముఖ న్యూస్ ఎజేన్సీ ఐఏఎన్‌ఎస్ తెలిపింది.

ఇక కరోనా కారణంగా ఈ ఆవార్డుల నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర క్రీడ్రా మంత్రిత్వశాఖ అన్‌లైన్‌ వేదికగా దేశంలోని స్పోర్ట్స్ అసోషియేషన్స్ నుంచి నామినేషన్స్ స్వీకరిస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఫైనల్‌కి చేరిన భారత్ జట్టు.. టైటిల్ ఫైట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో ఓడిన విషయం తెలిసిందే.

ఇక ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన శిఖా పాండే ఏడు వికెట్లు పడగొట్టగా.. 3/14 బెస్ట్. ఇక ఆల్‌రౌండర్‌గా దీప్తి శర్మ మొదటి మ్యాచ్‌ నుంచే తన మార్క్ ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 49 పరుగులు చేసిన దీప్తి.. టోర్నీలో మొత్తం 116 చేసింది. మొత్తంగా భారత్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. నిలకడగా రాణించిన ఈ ఇద్దరి పేర్లను నామినేషన్‌కి పంపాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

2018లో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అర్జునా అవార్డుని దక్కించుకోగా.. 2019లో ఆ అవకాశం టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి దక్కింది. అయితే.. ఈ ఏడాది భారత ఫురుష క్రికెటర్ల ఎవరూ నామినేషన్‌లో నిలిచే సూచనలు కనిపించడం లేదు.

వార్నర్ సర్.. మరో సర్‌ప్రైజ్‌తో చంపేసారు: అల్లు అర్జున్వార్నర్ సర్.. మరో సర్‌ప్రైజ్‌తో చంపేసారు: అల్లు అర్జున్

Story first published: Tuesday, May 12, 2020, 21:42 [IST]
Other articles published on May 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X