న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా భయం.. ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్

BCCI issues strict guidelines to players amid coronavirus scare

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌లో పెరుగుతున్న నేపథ్యంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరగనున్న మూడు వన్డే సిరీస్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భారత క్రికెట్ నియంత్రమండలి(బీసీసీఐ) దృష్టి సారించింది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య గురువారం ధర్మశాల వేదికగా తొలివన్డే జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ జారీ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) జారీ చేసిన ఏడు మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.

బీసీసీఐ పర్యవేక్షిస్తోంది..

బీసీసీఐ పర్యవేక్షిస్తోంది..

‘కరోనా వైరస్ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్తిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ, భారత ప్రభత్వం హెల్త్ అండ్ వెల్ఫర్ మంత్రిత్వశాఖ జారీ చేసిన ప్రామాణిక మార్గదర్శకాల గురించి క్రికెటర్లకు, జట్టు సహాయక సిబ్బంది, రాష్ట్ర అసోసియేషన్‌లకు వివరించడం జరిగింది.'అని బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఆ గైడ్ లైన్స్ ఏంటంటే..

ఆ గైడ్ లైన్స్ ఏంటంటే..

1. సబ్బు , నీళ్లతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవాలి.

2. హ్యాండ్ శానిటైజర్లు వాడాలి.

3. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు టిష్యూ లేదా గుడ్డతో ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవాలి.

4. జ్వరం, జలుబు, అలసటగా అనిపించినా వెంటనే మెడికల్ టీమ్‌కు తెలియజేయాలి.

5. చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖం, ముక్కు, నోటిని తాకవద్దు.

6. పరిశుభ్రత ప్రమాణాలు పాటించని లేదా తెలియని రెస్టారెంట్లకు వెళ్లవద్దు.

7. టీమ్‌తో సంబంధం లేని వ్యక్తులతో సన్నిహితంగా ఉండవద్దు. వారితో మాట్లాడటం, సెల్ఫీలు దిగడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం అస్సలు చేయవద్దు. ఎవరితోనూ చేతులు కలపవద్దు. ఎయిర్‌లైన్స్, హోటల్ సిబ్బందితో కూడా ఇలానే వ్యవహరించాలి.

మైదానంలో హోర్డింగ్స్..

మైదానంలో హోర్డింగ్స్..

ఇక ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగుతుండటంతో.. ప్రేక్షకులకు ఈ వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు, రక్షణ కల్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. స్టేడియం చుట్టు హోర్డింగ్స్ ఏర్పాటు చేయించారు. అలాగే స్టేడియం పబ్లిక్ టాయిలెట్స్‌లో హ్యాండ్ వాష్ లిక్విడ్స్, శానిటైజర్స్‌ను నింపారు.

60కి పైగా కరోనా కేసులు..

60కి పైగా కరోనా కేసులు..

కరోనా వైరస్ దేశంలో మరింత విస్తరిస్తుంది. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో 60కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేరళ, కర్ణాటక, పూణెలో కొత్త కేసులతో ఆందోళన కలిగిస్తున్నాయి.కొత్త కేసులు నమోదు అవుతుండడంతో అప్రమత్తమైన కేంద్రం...రాష్ట్రాలకు సూచనలు జారీ చేయడంతో పాటు హై అలర్ట్ ప్రకటించింది. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ తదితర దేశ పౌరులకు వీసాల అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Story first published: Wednesday, March 11, 2020, 20:39 [IST]
Other articles published on Mar 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X