న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Squad for England 5th Test : ఒకవేళ రోహిత్ శర్మ ఆడకుంటే టెస్ట్ టీంలో ఓపెనర్‌గా అతనే.. బీసీసీఐ ప్రకటన

BCCI Confirms That Mayank Agarwal as Cover player for Rohit sharma

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కోవిడ్-19 బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అతన్ని బ్యాకప్ చేసే ప్లేయర్‌గా ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను మేనేజ్ మెంట్ సెలెక్ట్ చేసింది. ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ చేసిన మ్యాచ్ కోసం భారత టెస్ట్ జట్టులో అతన్ని చేర్చారు. ఇకపోతే టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ఈ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డంతో.. మయాంక్ జట్టులో చేరడం చాలా కీలకంగా మారింది.

ఎందుకంటే రెగ్యులర్ ఓపెనర్లలో ప్రస్తుతం శుభ్‌మన్ గిల్‌ మాత్రమే జట్టులో ఉన్నాడు. దీంతో మయాంక్ అగర్వాల్‌ను మేనేజ్ మెంట్ మరో ఓపెనర్‌గా తీసుకుంది. గతంలో మయాంక్ టీమిండియా తరఫున టెస్ట్‌లలో ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే.

బీసీసీఐ అధికారిక ప్రకటన

బీసీసీఐ అధికారిక ప్రకటన

ఈ విషయమై బీసీసీఐ ఓ అధికారిక ప్రకటన కూడా చేసింది. 'రోహిత్ శర్మకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినందున శర్మకు బ్యాకప్ ప్లేయర్‌గా ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్‌ను రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ కోసం భారత టెస్ట్ జట్టులో చేర్చింది. మయాంక్ ఇప్పటికే యూకేకి బయలుదేరాడు. త్వరలోనే జట్టుతో పాటు కలుస్తాడు.' అని బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఇకపోతే లీసెస్టర్‌షైర్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 25పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అతను బ్యాటింగ్ చేయలేదు. ఆదివారం అతనికి పాజిటివ్ వచ్చినట్లు బీసీసీఐ ధృవీకరించింది.

సవరించిన భారత టెస్ట్ జట్టు

సవరించిన భారత టెస్ట్ జట్టు

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ షమీ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్

కెప్టెన్ ఎవరు..? వైస్ కెప్టెన్ ఎవరు?

కెప్టెన్ ఎవరు..? వైస్ కెప్టెన్ ఎవరు?

ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ టెస్టు సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంతకుముందు రోహిత్ కెప్టెన్సీలో ఈ ఏడాది శ్రీలంకపై స్వదేశంలో 2-0తో ఇండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత ఇది రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా రెండో టెస్ట్ పర్యటన. ఎడ్జ్‌బాస్టన్‌లో జులై 1న జరిగే మ్యాచ్‌ వరకు అతను కోలుకుంటే తుది జట్టులో ఉంటాడు.

లేకపోతే భరత్ గానీ మయాంక్ అగర్వాల్ గానీ తుది జట్టులో ఆడతారు. రోహిత్ ఆడని పక్షంలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఎవరు చేపడతారనే విషయంలో డైలామా కొనసాగుతుంది. పుజారా లేదా రిషబ్ పంత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశముండగా.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్థానంలో.. అశ్విన్ లేదా జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టొచ్చు.

Story first published: Monday, June 27, 2022, 17:23 [IST]
Other articles published on Jun 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X