లక్కీ చాన్స్ కొట్టేసిన యువ పేసర్.. షమీ స్థానంలో బంగ్లా పర్యటనకు.. బీసీసీఐ అధికారిక ప్రకటన!

న్యూఢిల్లీ: భుజ గాయంతో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు దూరమైన మహమ్మద్ షమీ స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే షమీ గాయపడటంతో వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతను టెస్ట్ సిరీస్ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. షమీ గాయం తీవ్రతపై ఎలాంటి సమాచారం ఇవ్వని బీసీసీఐ.. ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది.

జైషా పేరిట ప్రకటన..

బీసీసీఐ సెక్రటరీ జై షా పేరిట ఈ ప్రకటన విడుదలైంది. 'బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ముందు ప్రాక్టీస్ సెషన్‌లో మహమ్మద్ షమీ భుజానికి గాయమైంది. అతను ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో టీమిండియా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. బంగ్లాతో మూడు వన్డేల సిరీస్‌కు అతను దూరమయ్యాడు.

అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను ఆలిండియా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.'అని జై షా ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఉమ్రాన్ మాలిక్ ఆదివారం జట్టుతో కలిసే అవకాశం ఉంది. దాంతో అతను తొలి వన్డే ఆడే అవకాశం లేదు. యువపేసర్ కుల్దీప్ సేన్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సూపర్ ఫామ్‌లో ఉమ్రాన్ మాలిక్..

సూపర్ ఫామ్‌లో ఉమ్రాన్ మాలిక్..

ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో 2 వికెట్లతో సత్తా చాటిన మాలిక్.. జట్టుకు మాత్రం విజయాన్నందించలేకపోయాడు. వర్షం కారణంగా రద్దయిన మూడో వన్డేలో ఓ వికెట్ పడగొట్టాడు. ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత్.. బంగ్లాదేశ్ పర్యటనను మొదలుపెట్టనుంది. మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకా‌లోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి.

రేపే తొలి వన్డే..

రేపే తొలి వన్డే..

తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14-18 వరకు చట్టోగ్రమ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22-26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. రెండు టెస్ట్‌లు 9.30కు ప్రారంభం కానున్నాయి.

టీమిండియా రివైజ్డ్ వన్డే టీమ్

టీమిండియా రివైజ్డ్ వన్డే టీమ్

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్, షెహ్‌బాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, December 3, 2022, 12:16 [IST]
Other articles published on Dec 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X