న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2021 టీ20 ప్రపంచకప్ ఎక్కడ? బీసీసీఐ-ఐసీసీ మధ్య వార్

BCCI and Cricket Australia at loggerheads over right to hold 2021 T20 World Cup
T20 World Cup 2021 : BCCI & ICC మధ్య Talks Exemption వార్! || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ వాయిదా పడినా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మధ్య వార్ మాత్రం మరికొంత కాలం కొనసాగక తప్పెలా లేదు. రాబోయే రెండేళ్లలో (2021,2022) జరిగే రెండు టీ20 ప్రపంచకప్‌లు ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఐసీసీ క్లారిటీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. వాస్తవానికి 2021 టీ20 ప్రపంచకప్ రైట్స్ ఇండియా చేతుల్లో ఉన్నాయి. కానీ ఐసీసీ మాత్రం ఈ రైట్స్‌ను ఆసీస్‌కు కట్టబెట్టాలని చూస్తోంది.

ఆతిథ్య హక్కులపై

ఆతిథ్య హక్కులపై

2022 ఆతిథ్య హక్కులను భారత్‌కు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. కానీ ఇందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే 2023‌లో వన్డే ప్రపంచకప్‌ కూడా మన దగ్గరే జరగనుంది. కాబట్టి వరుసగా రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లను నిర్వహించడం కరెక్ట్ కాదని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. సోమవారం ఐసీసీ మీటింగ్‌లో ఇదే విషయంపై పెద్ద చర్చే జరిగింది.

ఆసీస్‌కు ఇవ్వాలని..

ఆసీస్‌కు ఇవ్వాలని..

2021 రైట్స్‌ను ఆసీస్‌కు ఇవ్వాల్సిందేనని ఐసీసీ ఎంత పట్టుబట్టినా.. బీసీసీఐ ప్రతినిధి ససేమిరా ఒప్పుకోలేదు. దీనికి ఆగ్రహించిన ఐసీసీ.. రాబోయే మూడు మెగా ఈవెంట్స్‌కు సంబంధించిన కొత్త టైమ్‌లైన్‌ను రిలీజ్ చేసి వేదికలను మాత్రం సస్సెన్స్‌లో పెట్టింది. దీంతో పాటు 2023 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను కూడా మార్చేసింది. రెండు ఈవెంట్లకు సరిపోయినంత టైమ్ ఉందని చెప్పడానికి మరో రీజన్‌ను కూడా సిద్దం చేసింది. ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐ మధ్య టాక్స్ ఎగ్జెంప్షన్ వార్ కూడా నడుస్తున్నది.

పన్నులు మినహాయించకుంటే..

పన్నులు మినహాయించకుంటే..

భారత గవర్నమెంట్ నుంచి పన్ను మినహాయింపులకు సంబంధించి క్లారిటీ తీసుకురావాలని నవంబర్ వరకు గడువు కూడా ఇచ్చింది. ఈ గడువులోగా బీసీసీఐ ఏం తేలుస్తుందో చూసి.. డిసెంబర్‌లో టీ20 వరల్డ్ కప్(2021) పై ఫైనల్ నిర్ణయం తీసుకోవాలన్నది ఐసీసీ ఆలోచన. ట్యాక్స్ విషయంలో బీసీసీఐ సక్సెస్ అయితే 2021 టీ20 వరల్డ్‌కప్ మన దగ్గర.. లేదంటే ఆసీస్‌లో ఉండనుంది. అయితే స్టార్ ఇండియా కూడా దీనికి ఒకే చెప్పాలి.

దుబాయ్‌లో ఐపీఎల్..

దుబాయ్‌లో ఐపీఎల్..

ఐపీఎల్‌-2020ని యూఏఈలో నిర్వహించడం ఖాయమైంది. టోర్నీ మొత్తం అక్కడే జరపనున్నట్లు లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్, భారత మాజీ క్రికెటర్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ప్రకటించారు. వచ్చే వారం జరిగే మరో సమావేశంలో తుది షెడ్యూల్‌తోపాటు ఇతర వివరాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టి20 ప్రపంచకప్‌ వాయిదా కోసం ఎదురుచూస్తూ వచ్చిన బీసీసీఐ ఇప్పుడు ఆ ప్రకటన రాగానే లీగ్‌ కార్యాచరణకు సిద్ధమైంది. కోవిడ్‌-19 కారణంగా పలు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉందని పటేల్‌ చెప్పారు.

మహిళల వన్డే ప్రపంచకప్ జరిగేనా.. మిథాలీ కల నెరవేరెనా?

Story first published: Wednesday, July 22, 2020, 9:29 [IST]
Other articles published on Jul 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X