Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళల వన్డే ప్రపంచకప్ జరిగేనా.. మిథాలీ కల నెరవేరెనా?

Decision on 2021 Womens World Cup will be taken in the next two weeks

క్రైస్ట్‌చర్చ్: భారత మహిళా క్రికెటర్, హైదరాబాద్ స్టార్ మిథాలీ రాజ్‌కు పెద్ద చిక్కువచ్చిపడింది. మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా వచ్చే ఏడాది జరగబోయే మహిళల వన్డే వరల్డ్‌కప్ ఆమెకు చాలా ప్రత్యేకం. ఈ మెగా టోర్నీలో ఎలాగైనా విజయం సాధించి ప్రపంచకప్‌ను ముద్దాడాలని మిథాలీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే, ఈ టోర్నీ షెడ్యూల్ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని రెండు రోజుల క్రితం ఐసీసీ ప్రకటించింది. కానీ, ఆ మెగా టోర్నీపై రెండు వారాల్లో నిర్ణయం ప్రకటిస్తామని ఆతిథ్య కివీస్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొనడం సందేహాలు రేపుతోంది.

రెండు వారాల్లో చెబుతాం..

రెండు వారాల్లో చెబుతాం..

‘కరోనా పరిస్థితుల నేపథ్యంలో మహిళల వన్డే ప్రపంచకప్ వాయిదా వేయాలా లేదంటే షెడ్యూల్‌ ప్రకారమే ముందుకెళ్లాలా అన్నదానిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటాం. టోర్నీ విషయంలో వీలైనంత త్వరగా స్పష్టత వస్తే మేలు అని భావిస్తున్నాం. ఒక వేళ నిర్ణయం ఆలస్యమైతే మేం అప్పటికే అన్ని వనరులను ఉపయోగించుకుని చాలా ఏర్పాట్లు చేసేస్తాం. అలాంటప్పుడు రద్దయితే చాలా నష్టపోతాం. అన్ని జట్లను ఇక్కడకు తీసుకురావడం, క్వారంటైన్ నిబంధనలు పాటించడం.. చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. అందుకే తొందరపడుతున్నాం'అని కివీస్‌ క్రికెట్‌ చైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే పేర్కొన్నారు.

భారత మహిళల ఇంగ్లండ్‌ పర్యటన రద్దు

భారత మహిళల ఇంగ్లండ్‌ పర్యటన రద్దు

భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటన రద్దయింది. ప్రస్తుతానికి ఇరు దేశాల బోర్డులు అధికారికంగా ప్రకటించకున్నా.. దాదాపు ఈ టూర్ అటకెక్కినట్లేనని తెలుస్తోంది. కరోనా కారణంగా మన జట్టు అక్కడికి వెళ్లి ఆడే పరిస్థితి లేదు కాబట్టి టూర్‌ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌లోనే భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ20ల్లో తలపడాల్సింది. అప్పుడు దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినా... ఇప్పుడు పూర్తిగా రద్దయినట్లే.

ముక్కోణపు సిరీస్ అన్నా..

ముక్కోణపు సిరీస్ అన్నా..

అయితే వచ్చే సెప్టెంబరులోనైనా భారత్, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి ముక్కోణపు టోర్నీ నిర్వహించాలని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. అయితే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో సెప్టెంబర్‌లోనూ ఈ ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్య ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక భారత్‌ రాకపోతే దక్షిణాఫ్రికాతోనైనా ద్వైపాక్షిక సిరీస్‌ ఆడాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

Story first published: Wednesday, July 22, 2020, 8:29 [IST]
Other articles published on Jul 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+