న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంఎస్ ధోనీ చేతిలో సౌరవ్ గంగూలీ ఓటమి!!

Battle of the captains: MS Dhoni beats Sourav Ganguly by a whisker

హైదరాబాద్: సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ.. ఇద్దరిలో భారత బెస్ట్ కెప్టెన్ ఎవరు? అని సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు, అభిమానులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. అయితే ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఫిక్సింగ్ ఉదంతంలో ఇరుక్కుని ఉన్న జట్టును ప్రపంచకప్ ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఘనత 'దాదా'ది అయితే.. జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత మహీది. ఒకరు ఎక్కువ కాదు.. మరొకరు తక్కువ కాదు. అయితే మాజీలు ఏం చెప్పినా.. అభిమానుల మనసులో ఏమున్నా.. తాజాగా ఓ సర్వే మాత్రం ధోనీనే బెస్ట్ కెప్టెన్ అని తేల్చేసింది.

స్టార్‌ స్పోర్ట్స్ సర్వే

స్టార్‌ స్పోర్ట్స్ సర్వే

తాజాగా స్టార్‌ స్పోర్ట్స్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. టెస్టుల్లో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ స్వదేశీ, విదేశీ రికార్డులు.. వన్డేల్లో వారు సాధించిన ఘనతలు.. కెప్టెన్‌గా ఉన్న సమయంలో వారు చేసిన పరుగులు.. జట్టుపై వారి కెప్టెన్సీ ప్రభావం తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని స్టార్‌ స్పోర్ట్స్ సర్వేని నిర్వహించింది. సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు పాల్గొనగా.. జ్యూరీలో జర్నలిస్ట్‌లు, మాజీ క్రికెటర్లు, బ్రాడ్‌కాస్టర్స్‌‌కి అవకాశం కల్పించారు.

0.4 తేడాతో గంగూలీ ఓటమి

0.4 తేడాతో గంగూలీ ఓటమి

స్టార్‌ స్పోర్ట్స్ నిర్వహించిన సర్వేలో ఎంఎస్ ధోనీ 0.4 తేడాతో సౌరవ్ గంగూలీపై విజయం సాధించాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుని మెరుగ్గా తీర్చిదిద్దడం.. ఆ తర్వాత అదే బెస్ట్ జట్టు‌ని తర్వాత కెప్టెన్‌కి అప్పగించడంలో గంగూలీకి మార్కులు పడగా.. ఐసీసీ ప్రపంచకప్‌‌లు గెలవడం, కెప్టెన్‌గా ఉన్న సమయంలో మెరుగ్గా బ్యాటింగ్ చేయడం ధోనీకి కలిసొచ్చింది. వీటితో పాటు ధోనీ ప్రభావం జట్టుపై బాగా ఉందాం కూడా ముందు వరసలో ఉండేలా చేసింది. ఈ సర్వే పోల్‌లో ఓటు వేసిన మాజీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర.. భారత మాజీ ఓపెనర్లు గౌతమ్ గంభీర్, క్రిస్ శ్రీకాంత్ ఉన్నారు. వారు ఎలా ఓటు వేశారు అనే దానిపై సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు.

విదేశాల్లో దాదా హవా

విదేశాల్లో దాదా హవా

భారత్ గడ్డపై 21 టెస్టులకి కెప్టెన్సీ వహించిన సౌరవ్ గంగూలీ 47.6 శాతం విజయాల్ని అందుకోగా.. ఎంఎస్ ధోనీ 30 టెస్టుల్లో 70 శాతం రికార్డుని కలిగి ఉన్నాడు. విదేశాల్లో 29 టెస్టులకి గంగూలీ 39 శాతం.. 30 టెస్టుల్లో కేవలం 20 శాతం మాత్రమే గెలుపు రికార్డ్‌ ధోనీ నమోదు చేశాడు. వన్డేలపరంగా చూసుకుంటే మొత్తంగా 146 మ్యాచ్‌లకి కెప్టెన్సీ వహించిన గంగూలీ.. 76 మ్యాచ్‌ల్లో జట్టుని గెలిపించాడు. ధోనీ 200 మ్యాచ్‌లకి 110 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందించాడు.

బ్యాట్స్‌మెన్‌గా ధోనీదే పైచేయి

బ్యాట్స్‌మెన్‌గా ధోనీదే పైచేయి

కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఒక బ్యాట్స్‌మెన్‌గానూ సౌరవ్ గంగూలీపై ఎంఎస్ ధోనీదే పైచేయిగా ఉంది. గంగూలీ 49 టెస్టుల్లో 37.66 సగటుతో 2,561 పరుగులు చేయగా.. ధోనీ 60 టెస్టుల్లో 40.66 సగటుతో 3,454 పరుగులు చేశాడు. మరోవైపు 142 వన్డేల్లో గంగూలీ 38.79 సగటుతో 5,082 పరుగులు చేయగా.. ధోనీ 172 వన్డేల్లో 53.55 సగటుతో 6,641 పరుగులు చేశాడు. ఇక ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా దాదా జట్టుకి అందించపోగా.. మహీ ఏకంగా మూడు అందించాడు. కెప్టెన్‌గానూ జట్టుపై ఎంతో ప్రభావం చూపాడు.

'విండీస్‌ని లైట్ తీసుకున్నారా?.. యాషెస్ సిరీస్‌ అయితే బ్రాడ్ ‌ఆడేవాడు కాదా?'

Story first published: Tuesday, July 14, 2020, 16:27 [IST]
Other articles published on Jul 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X