Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'విండీస్‌ని లైట్ తీసుకున్నారా?.. యాషెస్ సిరీస్‌ అయితే బ్రాడ్ ‌ఆడేవాడు కాదా?'

ENG vs WI: Nasser Hussain has questioned the team management for leaving Stuart Broad out of first Test

లండన్: కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల తర్వాత జరిగిన తొలి బయోబబుల్‌ టెస్టు‌ విజయవంతం అయింది. సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో విండీస్‌దే పైచేయి అయ్యింది. ఆదివారం ముగిసిన మొదటి టెస్టులో విండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ ఆటగాడు జెర్నేన్ బ్లాక్‌వుడ్‌ (95; 12 ఫోర్లు) అదరగొట్టడంతో.. 200 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్లాక్‌వుడ్‌తో పాటు కెప్టెన్ జేసన్ హోల్డర్, షెనాన్ గాబ్రియేల్‌ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ల పనిపట్టారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

వెస్టిండీస్‌ చేతిలో ఊహించని పరాభవానికి ఇంగ్లండ్ జట్టు‌పై రోజురోజుకు విమర్శలు ఎక్కువవుతున్నాయి. తొలి టెస్టుకి రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ దూరమగా.. అతని స్థానంలో జట్టుని నడిపించిన బెన్ ‌స్టోక్స్ పేలవ నిర్ణయాలతో ఇంగ్లండ్ ఓటమికి కారణమయ్యాడు. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ఆదిలోనే పెద్ద పొరపాటు చేశాడు. తుది జట్టు నుంచి సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ని తప్పించడం మరో తప్పిదం ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్‌లో చివరి రోజు కీలకమైన బ్లాక్‌వుడ్ క్యాచ్‌ని స్లిప్‌‌లో చేజార్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు.

వెస్టిండీస్‌ని లైట్ తీసుకున్నందుకు ఇంగ్లండ్ భారీగా మూల్యం చెల్లించుకుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. తాజాగా నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లోని మొదటి టెస్టులో స్టువర్ట్ బ్రాడ్‌‌కి కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉంటుంది. నేను 100 శాతం ధీమాతో ఈ మాట చెప్తున్నా. మరి వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అతనికి ఎందుకు చోటివ్వలేదు?. వెస్టిండీస్‌ని తక్కువ అంచనా వేసి.. లైట్ తీసుకున్నారా? అని ప్రశ్నించాడు. గతంలో వెస్టిండీస్‌ని ఇలానే తక్కువ అంచనా వేయడంతో ఇంగ్లండ్‌ని ఓడించారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు' అని నాజర్ హుస్సేన్ అన్నాడు.

జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టినా ఆటగాడిగా తనలో ఎలాంటి మార్పు ఉండదని, మునుపటిలాగే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలనని ఇంగ్లండ్‌ తాత్కాలిక కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా ఆడడంతో అతడిపై విమర్శలు వచ్చాయి. దీనిపై స్టోక్స్‌ స్పందించాడు. కెప్టెన్ అయినంత మాత్రనా తన ఆట ఏ మాత్రం మారదని స్పష్టం చేశాడు. అలాగే ఈ మ్యాచ్‌కు సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను తీసుకోకపోవడంపై చింతించడం లేదన్నాడు. జట్టు సమీకరణాలు, మ్యాచ్‌ పరిస్థితుల కారణంగానే ఆ నిర్ణయం తీసుకున్నామని స్టోక్స్‌ చెప్పాడు.

Story first published: Tuesday, July 14, 2020, 15:30 [IST]
Other articles published on Jul 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+