న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టెస్టు క్రికెట్ ఆడటం.. మా వాళ్లకు ఇష్టం లేదు'

 Bangladesh senior players reluctant to play Tests - BCB president

హైదరాబాద్: క్రికెట్లో టెస్టు ఫార్మాటే అత్యుత్తమమైందని.. దాన్ని ఆడటం పెద్ద గౌరవమని అంటుంటారు దిగ్గజ ఆటగాళ్లు. అలాంటి ఫార్మాట్‌ పట్ల విముఖత చూపిస్తున్నారట బంగ్లాదేశ్‌ సీనియర్‌ క్రికెటర్లు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడైన నజ్ముల్‌ హసన్‌ స్వయంగా వెల్లడించడం విశేషం. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌హసన్‌ సహా పలువురు ఆటగాళ్లు టెస్టుల పట్ల ఆసక్తితో లేరని అతను వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా జట్లలో టెస్టుల పట్ల ఆసక్తి తగ్గుతున్నట్లు హసన్‌ చెప్పాడు.

'ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మినహాయిస్తే ఐసీసీలోని మిగతా దేశాలేవీ టెస్టుల పట్ల ఆసక్తి చూపించట్లేదు. ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులతో పాటు ప్రసార సంస్థలు కూడా ఈ ఫార్మాట్‌ పట్ల విముఖత చూపిస్తున్నాయి. టెస్టుల పట్ల ప్రేక్షకుల్లో ఉత్సాహం లేదంటున్నాయి. మా దేశంలోనూ కొందరు సీనియర్‌ ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌ పట్ల అనాసక్తితో ఉన్నారు. షకిబ్‌కు టెస్టులాడటం ఇష్టం లేదు. ముస్తాఫిజుర్‌ కూడా అంతే.

ఆ విషయం అతను చెప్పట్లేదు. ఎక్కువగా టెస్టులాడితే గాయాల పాలవుతానని అతను భయపడుతుండొచ్చు. కుర్రాళ్లను ఎంచుకోవడమే మా ముందున్న మార్గం. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మినహాయిస్తే ఐసీసీలోని మిగతా దేశాలేవీ టెస్టుల పట్ల ఆసక్తి చూపించట్లేదు. ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులతో పాటు ప్రసార సంస్థలు కూడా ఈ ఫార్మాట్‌ పట్ల విముఖత చూపిస్తున్నాయి.

టెస్టుల పట్ల ప్రేక్షకుల్లో ఉత్సాహం లేదంటున్నాయి. మా దేశంలోనూ కొందరు సీనియర్‌ ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌ పట్ల అనాసక్తితో ఉన్నారు. షకిబ్‌కు టెస్టులు ఆడటం ఇష్టం లేదు. ముస్తాఫిజుర్‌ కూడా అంతే. కానీ ఆ విషయం అతను చెప్పట్లేదు' అని హసన్‌ పేర్కొన్నాడు.

Story first published: Sunday, July 22, 2018, 14:40 [IST]
Other articles published on Jul 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X