న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC 2023 ఫైనల్ ఏమాయేరా ఆజామూ..! పాక్ ఓటమిపై పేలుతున్న సెటైర్లు!

Babar Azam Brutally Trolled after Pakistan out of World Test Championship 2023 final race

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాక్ ఓటమిపాలైంది. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్.. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ 2023 ఫైనల్ చేరే అవకాశాలను కూడా కోల్పోయింది.

దాంతో ఆ జట్టుపై అభిమానులు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను టార్గెట్ చేస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. సిరీస్ ప్రారంభానికి ముందు బాబర్ ఆజామ్ మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతాం..

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతాం..

ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంభానికి ముందు బాబర్ ఆజామ్ మాట్లాడుతూ..'మేం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఆశగా ఎదురుచూస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన సిరీస్. వచ్చే ఐదు టెస్టుల్లో మేం నాలుగు గెలిచినా, ఫైనల్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఈ సిరీస్‌కి ముందు మాకు కావాల్సినంత విశ్రాంతి సమయం దొరికింది. మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాం. నసీం షా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మేం ఈ టెస్టు సిరీస్ గెలుస్తామనే నమ్మకం ఉంది. 'అని బాబర్ ప్రగల్భాలు పలికాడు.

ఏమాయేరా ఆజామూ..

కానీ ఇంగ్లండ్ అసాధారణ ప్రదర్శనతో సొంతగడ్డపై పాక్ విలవిలలాడింది. బజ్ బాల్ కాన్సెప్ట్‌తో చెలరేగిన బెన్ స్టోక్స్ సేన.. తొలి టెస్ట్ తొలి రోజే 506 పరుగులు చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసింది. పాకిస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడింది. రెండో టెస్ట్‌లోనూ అదే జోరును కొనసాగించి పాక్‌ను ఓడించింది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ విజయానికి ఆస్కారం లభించింది. కానీ పేలవ బ్యాటింగ్ ఆ జట్టు మూల్యం చెల్లించుకొని డబ్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఏమాయారే ఆజామూ అంటూ ఫ్యాన్స్ ఎగతాళి చేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినట్టా..?

టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినట్టా..?

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం అంటే టీ20 ప్రపంచకప్ మాదిరి లక్కీగా ఫైనల్ చేరడం అనుకున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన పాకిస్థాన్.. నెదర్లాండ్స్ పుణ్యమా లక్కీగా సెమీస్ చేరిన విషయం తెలిసిందే.

సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడంతో పాక్‌కు లైన్ క్లియరైంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన పాక్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై మాత్రం గెలవలేకపోయింది. లక్ మాత్రమే ఉంటే సరిపోదనే విషయం పాక్ జట్టుకు బోధపడింది. టెస్ట్ సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌ను ఓడించలేకపోయిన పాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఆశమాషి వ్యవహారం కాదని తెలిసొచ్చింది.

26 పరుగుల తేడాతో..

26 పరుగుల తేడాతో..

328 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన పాకిస్థాన్ 328 పరుగులకు కుప్పకూలింది. సౌద్ షకీల్(213 బంతుల్లో 8 ఫోర్లతో 94) చేసిన ఒంటరి పోరాటం సరిపోలేదు. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్(4/65) నాలుగు వికెట్లతో చెలరేగడంతో పాకిస్థాన్ లక్ష్యానికి 27 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

సంక్షిప్త స్కోర్లు

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 281 ఆలౌట్

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 202 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 275 ఆలౌట్

పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 328 ఆలౌట్

Story first published: Monday, December 12, 2022, 20:29 [IST]
Other articles published on Dec 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X