న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో సారి వరల్డ్ నెం.1గా బాబర్ అజామ్

Babar Azam becomes number one T20I batsman in the world for the third time

హైదరాబాద్: ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ స్టన్నింగ్‌ ప్రదర్శనతో టీ20 టాప్‌ ర్యాంక్‌ అందుకున్నాడు. ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో బాబర్‌ దెబ్బకు ఆస్ట్రేలియా వైట్‌వాష్‌కు గురైంది. ఈ సిరీస్‌లో 68 నాటౌట్‌, 45, 50 పరుగులతో రాణించిన బాబర్‌ టీ20ల్లో టాప్‌ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

ఆరోన్‌ ఫించ్‌ సిరీస్‌తో పాటు టాప్‌ ర్యాంకును..

ఆరోన్‌ ఫించ్‌ సిరీస్‌తో పాటు టాప్‌ ర్యాంకును..

ఈ ఏడాదే బాబర్‌ మూడోసారి టాప్‌లో నిలవడం విశేషం. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ సిరీస్‌తో పాటు టాప్‌ ర్యాంకును కోల్పోయాడు. మూడు ఇన్నింగ్స్‌లో కేవలం మూడు పరుగులే చేసిన ఫించ్‌ ఇందులో రెండు సార్లు డకౌట్‌ కావడం గమనార్హం. 844 రేటింగ్‌ పాయింట్లతో బాబర్‌ టాప్‌లో ఉండగా.. ఫించ్‌(839) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

బాబర్‌.. తాను సంపాదించిన ర్యాంకు

బాబర్‌.. తాను సంపాదించిన ర్యాంకు

ఇక భారత బ్యాట్స్‌మన్‌ లోకెశ్‌ రాహుల్‌ (812) మూడో స్థానంలో ఉండగా.. కొలిన్‌ మున్రో (801), ఫకార్‌ జమాన్‌ (793) తరువాతి స్థానంలో ఉన్నారు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ 10వ స్థానంలో, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి 13వ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే బాబర్‌ తాను సంపాదించిన ర్యాంకు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

నాలుగో స్థానంలో ఉన్న కొలిన్‌ మున్రో

నాలుగో స్థానంలో ఉన్న కొలిన్‌ మున్రో

బుధవారం నుంచి న్యూజిలాండ్‌ వేదికగా జరిగే మూడు టీ20ల సిరీస్‌లో ఇదే తరహా ఫామ్‌ను కొనసాగించాలి. లేకుంటే నాలుగో స్థానంలో ఉన్న కొలిన్‌ మున్రో చెలరేగితే బాబర్‌ టాప్‌ ర్యాంకు చేజారే అవకాశం ఉంది. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ టాప్‌ ర్యాంకులోనే ఉండగా.. షాదాబ్‌ ఖాన్‌, ఇష్‌ సోదీ, చాహల్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నారు.

కోహ్లీ.. బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ సూపరే!!

మూడో టీ20లో పాకిస్తాన్‌ 33 పరుగుల తేడాతో

మూడో టీ20లో పాకిస్తాన్‌ 33 పరుగుల తేడాతో

పాకిస్తాన్‌తో జరిగినతో మూడు టీ20లో సిరీస్‌లో ఆస్ట్రేలియా వైట్‌వాష్‌ అయ్యింది. యూఏఈ వేదికగా జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలుద్దామని భావించిన ఆసీస్‌కు పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో పాకిస్తాన్‌ 33 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

Story first published: Tuesday, October 30, 2018, 11:20 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X