ఆస్ట్రేలియాతో పోరాడి పరాజయం ఎదుర్కొన్న భారత్ ఏ

Written By:
India_A234

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో పోరాడిన భారత మహిళల జట్టుకు నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన రెండో సన్నాహక వన్డే మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత-ఏ 170 పరుగులకు ఆలౌటైంది.

ఆస్ట్రేలియా బౌలర్లు వెల్లింగ్‌టన్‌ (3/30), గార్డ్‌నర్‌ (2/32) భారత-ఏను కట్టడి చేశారు. కెప్టెన్‌ అనుజ పాటిల్‌ (49) మినహా మిగతా బ్యాట్స్‌వుమెన్‌ విఫలమయ్యారు. బదులుగా ఆస్ట్రేలియా 26 ఓవర్లలో 3వికెట్లకు 171 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది.

కెప్టెన్‌ లానింగ్‌ (63 రిటైర్డ్‌), పెర్రీ (38 రిటైర్డ్‌) జట్టుకు విజయాన్ని అందించారు. తొలి మ్యాచ్‌లో భారత-ఏ 321 పరుగుల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌.. ఆస్ట్రేలియాతో తలపడనుంది.

సంక్షిప్తంగా స్కోరు వివరాలు:
భారత్ ఏ జట్టు ఆలౌట్ (170), అనూజ పాటిల్ 49, అమాండ జాడె వెల్లింగ్‌టన్ 30, ఆస్ట్రేలియన్ (171/3) మెగ్ లానింగ్ (63)

Story first published: Friday, March 9, 2018, 10:16 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి