న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL ఫ్రాంచైజీలకు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆరంభ మ్యాచ్‌లకు ఆ స్టార్ ఆటగాళ్లు దూరం!

Australia Players Are Not Available For IPL 2022 Until April 6th, Biggest Shock For All IPL Franchises
IPL 2022 ఆరంభ మ్యాచ్‌లకు Australia Players దూరం CA మొండిపట్టు | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చింది. మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఏకైక టీ20 కోసం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న ఆస్ట్రేలియా జట్టులో భాగం కానీ ఆటగాళ్లకు ఎన్‌వోసీ(నిరభ్యంతర పత్రం) ఇవ్వడం లేదు. దాంతో ఆ ఆటగాళ్లంతా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఏప్రిల్ 6నే భారత్‌కు తిరిగిరానున్నారు. మార్చి 4 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుండగా.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు గ్లేన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, జోష్ హజెల్ వుడ్, మాథ్యూ వేడ్‌లు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరూ.. ఐపీఎల్ పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండాలని మరికొందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వివాహం నేపథ్యంలో మ్యాక్స్‌వెల్ ఈ సిరీస్‌తో పాటు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరంకానున్నాడు.

ఎన్‌వోసీ జారీ చేయని ఆసీస్..

ఎన్‌వోసీ జారీ చేయని ఆసీస్..

అయితే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉన్న ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎన్‌వోసీ ఇవ్వడం లేదు. దాంతో వారు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే చాన్సుంది. ఏప్రిల్ 6 వరకు వారిని ఐపీఎల్ ఆడినిచ్చేదిలేదని క్రికెట్ ఆస్ట్రేలియా మొండిపట్టుమీదున్నట్లు తెలుస్తోంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా వైఖరిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బోర్డు పెద్దలు ఈ విషయమై ఆస్ట్రేలియా బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బీసీసీఐ మాటను కాదనే ధైర్యం క్రికెట్ ఆస్ట్రేలియాకు లేదు. ఇక్కడ తలొగ్గపోతే వేరే విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తుందని ఆ బోర్డుకు తెలుసు.

ఏప్రిల్ 6 వరకు..

ఏప్రిల్ 6 వరకు..

జట్టులో లేని ఆటగాళ్లను అడ్డుకోవడం దారుణమని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి అన్నాడు. ఆ ఆటగాళ్లంతా ఏప్రిల్ల 6న అందుబాటులోకి వస్తే.. కోవిడ్ రూల్స్ ప్రకారం వారి సేవలను వాడుకోవడానికి మరో వారం రోజులు టైమ్ పడుతుందని అసహనం వ్యక్తం చేశాడు. ఏప్రిల్11, 12 వరకు వారు అందుబాటులోకి రారాని, అప్పటికే మూడు, నాలుగు మ్యాచ్‌లు అయిపోతాయన్నాడు. ఈ విషయంపై బీసీసీఐతో మాట్లాడుతామని సదరు అధికారి పేర్కొన్నాడు. పాకిస్థాన్ పర్యటనలోని జట్టులో ఉన్నా లేకున్నా ఏప్రిల్ 6 వరకు అనుమతించేదే లేదని.. ఐపీఎల్ కాంట్రాక్టులున్న ఆటగాళ్లందరికి క్రికెట్ఆస్ట్రేలియా సోమవారమే తెలియజేసింది.

 ఐపీఎల్ ఆడనున్న ఆసీస్ ఆటగాళ్లు:

ఐపీఎల్ ఆడనున్న ఆసీస్ ఆటగాళ్లు:

ప్యాట్ కమిన్స్(కేకేఆర్- రూ.7.25 కోట్లు), మిచెల్ మార్ష్( ఢిల్లీ క్యాపిటల్స్- రూ.6.50 కోట్లు), డేవిడ్ వార్నర్(ఢిల్లీ క్యాపిటల్స్- రూ.6.25 కోట్లు), డానియల్ సామ్స్(ముంబై ఇండియన్స్- రూ.2.6 కోట్లు), మాథ్యూవేడ్( గుజరాత్ లయన్స్- రూ.2.4 కోట్లు), నాథన్ కౌల్టర్ నైల్(రాజస్థాన్ రాయల్స్- రూ.2 కోట్లు), సీన్ అబాట్(సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ.2.4 కోట్లు), రిలే మెరిడిత్(ముంబై ఇండియన్స్- రూ.1కోటీ), నాథన్ ఎల్లిస్(పంజాబ్ కింగ్స్- రూ.75లక్షలు), జాసన్ బెహ్రెండ్రాఫ(ఆర్‌సీబీ- రూ.75 లక్షలు), గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), మార్కస్ స్టోయినిస్(లక్నో-రూ.9.20 కోట్లు).

Story first published: Tuesday, February 22, 2022, 14:31 [IST]
Other articles published on Feb 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X