న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ - కేప్టెన్ ఆరోన్ ఫించ్ అవుట్: స్కాన్ రిపోర్ట్‌లో- ఆ మ్యాచ్‌కేనా.. లేక

 Australia Captain Aaron Finch likely to miss the game against Afghanistan due to hamstring pain

అడిలైడ్: ఆస్ట్రేలియా వేదికగా రసవత్తరంగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ 2022లో రెండో రౌండ్ గాయాల బెడద మొదలైనట్టే కనిపిస్తోంది. ఇదివరకు పలువురు ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. ఈ డ్రీమ్ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నారు. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. టోర్నమెంట్ ఆరంభానికి ముందే జస్‌ప్రీత్ బుమ్రా గాయం వల్ల వైదొలిగాడు. దాదాపుగా అన్ని జట్లు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ప్లేయర్లను రీప్లేస్ చేసుకున్నాయి.

రెండో విడత గాయాల బెడద..

రెండో విడత గాయాల బెడద..

పరాజయాలను చవి చూస్తూ వస్తోన్న పాకిస్తాన్ గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫకర్ జమాన్ గాయపడ్డాడు. ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఫకర్ జమాన్ మోకాలికి పోస్టీరియర్ క్రూసియేట్ లిగమెంట్ సమస్య తలెత్తినట్లు పేర్కొంది. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడతను. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని భావించినప్పటికీ.. సాధ్యం కాలేదు. అతని స్థానాన్ని మహ్మద్ హ్యారిస్ రీప్లేస్ చేశాడు.

ఫించ్ కూడా..

ఫించ్ కూడా..

ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా కేప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్ నొప్పితో సతమతమౌతోన్నాడు. ఈ నొప్పి తగ్గకపోతే తాను ఆప్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడబోనని తేల్చి చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి 70 శాతం మాత్రమే ఛాన్స్ ఉందని స్పష్టం చేశాడు ఫించ్. ఈ టోర్నమెంట్‌లో మున్ముందు కీలక మ్యాచ్‌లను ఆడాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు.

టిమ్ డేవిడ్ సైతం..

టిమ్ డేవిడ్ సైతం..

ఐర్లాండ్‌తో మ్యాచ్ తరువాత ఆరోన్ ఫించ్, టిమ్ డేవిడ్ దాదాపుగా ఒకే రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. హ్యామ్ స్ట్రింగ్ నొప్పి వారిని పీడిస్తోంది. నొప్పి ఏ మాత్రం తగ్గకపోయినా మ్యాచ్‌లో ఆడే రిస్క్ తీసుకోబోనని వివరించాడు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేశానని గుర్తు చేశాడు. ఇవ్వాళ మరోసారి తాను సెషన్స్‌లో పాల్గొంటానని, అప్పుడు కూడా తగ్గకపోతే ఇక విశ్రాంతి తీసుకుంటానని ఫించ్ స్పష్టం చేశాడు.

రిస్క్ తీసుకోదలచుకోలేదు..

రిస్క్ తీసుకోదలచుకోలేదు..

టిమ్ డేవిడ్ కూడా దాదాపుగా ఇదే రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నట్లు ఆరోన్ ఫించ్ చెప్పాడు. ఇద్దరి స్కానింగ్ రిపోర్ట్ దాదాపుగా ఒకేరకంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడటం తనకు ఇష్టం లేదని, మున్ముందు కీలక మ్యాచ్‌లను ఆడాల్సి ఉందని పేర్కన్నాడు. తాత్కాలిక రిలీఫ్ తీసుకుని ఆఫ్ఘనిస్తాన్‌లో మ్యాచ్‌లో ఆడితే- గాయం తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని మెడికల్ టీమ్ సైతం సూచించిందని చెప్పాడు.

అయిదుపాయింట్లతో..

అయిదుపాయింట్లతో..

ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అడిలైడ్ ఓవల్ స్టేడియం దీనికి వేదిక. గ్రూప్ 2లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లను ఆడింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆసీస్. శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఐర్లాండ్‌పై 42 పరుగుల తేడాతో గెలిచింది. మొత్తం అయిదు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

IPL 2023: ఆ ఇద్దరి కోసం కర్చీఫ్ వేసుక్కూర్చున్న ఫ్రాంఛైజీలు - కోట్లు పలికే ఛాన్స్..!!

Story first published: Thursday, November 3, 2022, 13:10 [IST]
Other articles published on Nov 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X