
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడటం లాభించింది
"2016లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడటం నాకు ఎంతో లాభించింది. నా స్పూర్తి జహీర్ ఖాన్. అతడిలా గొప్ప బౌలర్ కావాలని కలలు కన్నాను. ఈ దిగ్గజ ఆటగాడు చెప్పిన ప్రతీ సలహా, సూచన డైరీలో నోట్ చేసుకున్నా. నాకు ఏ సందేహం వచ్చినా ధైర్యంగా అడిగేవాడిని. యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియాకప్‌లో కూడా ఎలా ఆడాలో అతడి సూచనలు డైరీలో నోట్ చేసుకుంటాను" అని ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు.

జహీర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
"అందరూ నన్ను మరో జహీర్ అంటున్నారు. జహీర్ లెజెండ్ క్రికెటర్. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఒకరు స్థానాన్ని నేను భర్తీ చేయడమేంటి? తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటాను. జహీర్ ఖాన్ కంటే ఎక్కువ వికెట్లు తీస్తాను(నవ్వుకుంటూ)" అని ఖలీల్ తెలిపాడు.

ద్రవిడ్ అంటే ధైర్యం
"గెలుపోటముల గురించి ఆలోచించకు, నీ ఆట నువ్వు ఆడు" అంటూ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఖలీల్ అహ్మద్ అన్నాడు. ద్రవిడ్ పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఆడతామని, ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడని వివరించాడు. వందశాతం కష్టపడతానని, భారత్ తరుపున్న ఆడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నాడు.

తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు
ఆసియాకప్‌కు ఎంపిక కావడం పట్ల తన తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపాడు. ఆసియా కప్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటానని ఖలీల్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌లో ఆడే అవకాశం వస్తే తానేంటో నిరూపించుకుంటానని స్పష్టంచేశాడు. ఆస్ట్రేలియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏలతో జరిగిన మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన చేయడంతో ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. భారత్-ఏ తరుపున 17 మ్యాచ్‌లు ఆడిన ఖలీల్ 28 వికెట్లు తీశాడు.