న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: 'ధావన్‌తో ఓపెనింగ్... సౌకర్యంగా ఉంటుంది'

Asia Cup 2018: Rohit Sharma Reveals Details of Mid-Pitch Chat With Shikhar Dhawan To Coach Ravi Shastri

హైదరాబాద్: ఓపెనర్‌గా శిఖర్ ధావన్‌తో తనకెంతో సౌకర్యవంతంగా ఉంటుందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఆసియాకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా ఆదివారం భారత్‌-పాక్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అలవోక విజయం సాధించిన సంగతి తెలిసిందే.

<strong>వినూత్నంగా ఔట్: ఫకార్ జమాన్ ఎల్బీపై ట్విట్టర్‌లో నెటిజన్ల జోకులు</strong>వినూత్నంగా ఔట్: ఫకార్ జమాన్ ఎల్బీపై ట్విట్టర్‌లో నెటిజన్ల జోకులు

ఓపెనర్లు రోహిత్‌ శర్మ (111 నాటౌట్‌), శిఖర్‌ ధావన్‌ (114) సెంచరీలతో రాణించడంతో పాక్‌పై భారత్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రోహిత్ శర్న నేతృత్వంలోని టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 237 పరుగులు చేసింది.

అనంతరం భారత ఓపెనర్లు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాక్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించగలిగింది. దీంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటపట్ల తాను ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

1
44054

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ "మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లు ఎంతో కీలకం. వాటిని బాగా ఉపయోగించుకోగలిగితే ప్రత్యర్థి లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చు. ఈ కొద్ది ఓవర్లలో బ్యాటుకు పని చెబితే ఎన్నో పరుగులు రాబట్టుకోవచ్చు. ఓపెనర్లలో ధావన్‌తో ఆడటం నాకు సౌకర్యంగా ఉంటుంది" అని పేర్కొన్నాడు.

"అతడితో బ్యాటింగ్‌ గురించి చర్చించాల్సిన అవసరం ఉండదు. అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. ప్రత్యర్ధి జట్టు బౌలింగ్‌ను బట్టే ధావన్‌ బ్యాటింగ్‌ కూడా ఉంటుంది. ఇక, బుమ్రా విషయానికొస్తే టీమిండియాలో పరిణతి చెందిన బౌలర్లలో ఒకడు. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు" అని రోహిత్ శర్మ అన్నాడు.

"అంతేకాదు అక్కడి పరిస్థితులను బట్టి బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో బుమ్రాకు ఎంతో అనుభవం ఉంది. ఇక, భువీ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించడంలో భువీ దిట్ట. మ్యాచ్‌లో భువీ క్యాచ్‌లు పట్టడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, September 24, 2018, 18:45 [IST]
Other articles published on Sep 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X