న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా కోసం మెంటార్ అవతారమెత్తిన ధోనీ!!

Asia Cup 2018: MS Dhoni Turns Mentor In Head Coach Ravi Shastris Absence

హైదరాబాద్: మరో కొద్ది గంటల్లో టీమిండియాతో హాంకాంగ్ మ్యాచ్ మొదలుకానుంది. ఇప్పటికే దుబాయ్ చేరుకుని ప్రాక్టీసు దగ్గర ఉండాల్సిన హెడ్ కోచ్.. సహాయక సిబ్బంది ఎవ్వరూ టీమిండియాకు అందుబాటులో లేరు. దీంతో ఆ బాధ్యతలను ధోనీ మోయక తప్పడం లేదు. కెప్టెన్సీ బాధ్యతల్ని తప్పుకున్న తర్వాత కూడా జట్టును గైడ్‌ చేస్తూ విజయాల్లో ఎంఎస్‌ ధోని ముఖ్యభూమిక పోషిస్తూనే ఉన్నాడు.

తొలి మ్యాచ్‌లో భాగంగా మంగళవారం హాంకాంగ్‌ను ఎదుర్కోనున్న టీమిండియా.. బుధవారం పాకిస్థాన్‌తో తలపడనుంది. వెనువెంటనే మ్యాచ్‌లు ఉండటంతో భారత ఆటగాళ్లు సోమవారం వరకు నెట్‌ సెషన్‌లో తీవ్రంగా కసరత్తులు చేశారు. 'ఇన్‌ ఫోకస్ అండ్‌ ఇన్‌ ది జోన్‌.. మహేంద్రసింగ్‌ ధోనీ' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో ధోనీ ఫుల్‌ ఫ్లోలో బంతులను ఎదుర్కొంటున్నాడు.

కెప్టెన్‍గా ఎవరున్నా.. ధోనీ ప్రత్యేకం

కెప్టెన్‍గా ఎవరున్నా.. ధోనీ ప్రత్యేకం

జట్టు కష్ట సమయంలో ఉన్నప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దగ్గర్నుంచి, ఆటగాళ్ల వరకూ ధోని సలహాల్ని తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంచితే, ఆసియాకప్‌లో భాగంగా హాంకాంగ్‌తో తొలి మ్యాచ్‌ ఆడబోతున్న క్రమంలో ధోని మెంటార్‌ అవతారమెత్తాడు. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఉన‍్నప్పటికీ, యువ క్రికెటర్లను సానబట్టే పనిలో పడ్డాడు ధోని.

ప్రాక్టీస్‌ కొనసాగిస్తూనే బౌలర్లకు టిప్స్‌ చెప్పడం

ప్రధానంగా ప్రాక్టీస్‌ సెషన్‌లో అవీష్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌ క్రిష్ణ, సిద్దార్థ్‌ కౌల్‌, నదీమ్‌, మయాంక్‌ మార్కేండ్‌లు.. భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే యువ బౌలర్లకు మార్గనిర్దేశం చేస్తూ కనిపించాడు ధోని. అతని బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కొనసాగిస్తూనే బౌలర్లకు టిప్స్‌ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఇలా ధోనీ ప్రవర్తించడం పట్ల యువ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు.

మరోసారి మెంటార్‌ పాత్రలో కనిపించడం

సమస్యను సవాల్‌గా స్వీకరించే ధోని.. ఒక సీనియర్‌ క్రికెటర్‌గా తన బాధ్యతను గుర్తించి ఇలా మెంటార్‌ పాత్రలో కనిపించడం మరోసారి అతని ప్రత్యేకతను చాటింది. ఈ క్రమంలోనే నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్న ధోనీ వీడియోను బీసీసీఐ అన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

ధోనీ ట్రాక్ రికార్డు ఇలా:

2017లో వన్డేలు, టీ20ల కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ.. ఇప్పటివరకు 321 వన్డేలు ఆడి 10046 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇటీవల ఇంగ్లాండ్‌ పర్యటనలో ధోనీ ఆకట్టుకోలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లలో ధోనీ కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు.

Story first published: Tuesday, September 18, 2018, 15:24 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X