న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజా 4, రోహిత్ హఫ్ సెంచరీ: ఆసియా కప్‌లో బంగ్లాపై భారత్ విజయం

Asia Cup 2018 : India vs Bangladesh Match : Indian Wins Toss & Chooses To Bowl
Asia Cup 2018: India Vs Bangladesh: India wins the toss and elects to bowl first

హైదరాబాద్: ఆసియా కప్‌లో టీమిండియాకు మరో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. సూపర్-4లో భాగంగా శుక్రవారం దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది.

మెహదీ హసన్‌ మిరాజ్‌ (42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (4/29) చెలరేగగా, భువనేశ్వర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 190 డాట్‌ బంతులు (31.4 ఓవర్లు) ఆడింది. దీనిని బట్టి భారత బౌలింగ్‌ ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థమవుతుంది.

అనంతరం 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 36.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్‌ శర్మ (104 బంతుల్లో 83 నాటౌట్‌) వరుసగా ఈ టోర్నీలో రెండో హాఫ్ సెంచరీతో రాణించగా, శిఖర్‌ ధావన్‌ (47 బంతుల్లో 40), ధోని (37 బంతుల్లో 33) రాణించారు.

ఆసియా కప్ టోర్నీలో శనివారం విశ్రాంతి దినం కావడంతో మ్యాచ్‌లు లేవు. దీంతో ఆదివారం టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఆసియా కప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య 'సూపర్-4'లో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడ ఇప్పటికే రెండు మ్యాచులు ఆడామని, చేజింగ్ ఈజీగా ఉండటం వల్ల మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు.

ఈ టోర్నీలో గ్రూప్ దశలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు వరుసగా హాంకాంగ్, పాకిస్థాన్‌పై ఘన విజయాలతో మంచి జోరుమీదుంది. ఇక ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజా టీమ్‌లోకి వచ్చాడు.

అటు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌కు రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్న‌ది. ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌, ముస్త‌ఫిజుర్ రెహ‌మాన్ తుజి జట్టులోకి వచ్చారు. మరోవైపు తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టుపై 137 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్.. గురువారం పసికూన ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 136 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.

1
44052

దీంతో బంగ్లాదేశ్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. వన్డేల్లో ఇప్పటి వరకు ఇరు జట్లు 33సార్లు తలపడగా భారత్ 27 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్‌ ఏడో స్థానంలో ఉంది.

జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, చాహల్

బంగ్లాదేశ్: లిటన్‌ దాస్‌, నజ్ముల్‌ హుస్సేన్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్మద్‌ మిథున్‌, మహ్మదుల్లా, మొసాదక్‌ హుస్సేన్‌, మెహిది హసన్‌, మష్రఫె మొర్తజా, రూబెల్‌ హుస్సేన్‌, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌

Story first published: Saturday, September 22, 2018, 9:52 [IST]
Other articles published on Sep 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X