న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవును, అశ్విన్ చేసింది తప్పే!: 'మన్కడింగ్' రనౌట్‌పై యూటర్న్‌ తీసుకున్న ఎంసీసీ

Ashwins pause was too long, not within the spirit of the game: MCCs U-turn on Mankad controversy

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ క్రీడాస్ఫూర్తి తప్పాడని క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తాజాగా స్పష్టం చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇటీవలే జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా రనౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు అశ్విన్‌పై మండిపడగా.. మరికొందరు అతడికే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మన్కడింగ్ రనౌట్‌పై

మన్కడింగ్ రనౌట్‌పై

ఈ నేపథ్యంలో మన్కడింగ్ రనౌట్‌పై గత మంగళవారం స్పందించిన ఎంసీసీ... ఈ విషయంలో అశ్విన్‌ది ఏమాత్రం తప్పులేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు మన్కడింగ్‌ నిబంధన ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని... నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ అనవసరంగా క్రీజు వదిలి వెళ్లకూడదని మంగళవారం ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) ఓ ప్రకటనలో పేర్కొంది.

అశ్విన్‌ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా

అశ్విన్‌ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా

అయితే, తాజాగా ఎంసీసీ మేనేజర్‌ ఆఫ్‌ లాస్‌ ఫ్రేజర్‌ స్టీవార్ట్‌ అశ్విన్‌ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ ‘‘అశ్విన్ చేసిన మాన్కడింగ్ రనౌట్‌ని పూర్తిగా సమీక్షించిన తర్వాత.. అతను క్రీడాస్ఫూర్తి తప్పినట్లు మాకు అర్థమైంది. అశ్విన్‌ క్రీజును చేరుకునే సమయానికి.. బంతి వేయాలనుకునే సమయానికి మధ్య ఎక్కువ గ్యాప్‌ ఉన్నట్లు గుర్తించాం" అని అన్నారు.

ఉద్దేశపూర్వకంగానే అశ్విన్ అలా

ఉద్దేశపూర్వకంగానే అశ్విన్ అలా

"ఉద్దేశపూర్వకంగానే అశ్విన్ మాన్కడింగ్ రనౌట్ చేసేందుకు అలా చేసినట్లు తెలుస్తోంది. అశ్విన్‌ బంతి వేస్తాడని భావించిన బట్లర్‌.. ఆ సమయంలో క్రీజు వెలుపలికి వెళ్లిపోయాడు'' అని స్టీవార్ట్ స్పష్టం చేశాడు. ఎంసీసీ మంగళవారం ఇచ్చిన ప్రకటనపై యూటర్న్‌ తీసుకుందన్న వ్యాఖ్యలను సైతం స్టీవార్ట్‌ కొట్టిపారేశారు. బౌలర్‌ బంతి వేసేవరకూ నాన్‌స్ట్రైకర్‌ క్రీజును వదిలి వెళ్లకూడదని మరోసారి స్పష్టం చేశారు.

అశ్విన్‌ తన డెలివరీని ఆలస్యం చేశాడు

అశ్విన్‌ తన డెలివరీని ఆలస్యం చేసిన తర్వాత.. బట్లర్‌ క్రీజులోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించలేదని అన్నారు. బౌలర్‌ బంతి వేసేవరకూ నాన్‌స్ట్రైకర్‌ క్రీజులోనే ఉంటే.. ఈ విషయాలన్నీ ఇప్పుడు చర్చకు వచ్చేవే కాదని అన్నారు. అశ్విన్‌ బంతి వేయబోయే సమయానికే బట్లర్‌ క్రీజ్‌ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. ఇదే అదనుగా బౌలింగ్‌ని నిలిపివేసిన అశ్విన్ వెనక్కి వచ్చి బెయిల్స్ అప్పీల్‌ చేశాడు.

మన్కడింగ్ ఔట్‌ను సమర్ధించుకున్న అశ్విన్

మన్కడింగ్ ఔట్‌ను సమర్ధించుకున్న అశ్విన్

థర్డ్‌ అంపైర్‌ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్‌ వెనుదిరగాల్సి వచ్చింది. కానీ.. అశ్విన్ అనైతికతంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవచేసిన బట్లర్.. తిట్టుకుంటూనే పెవిలియన్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. అంతేకాదు జోస్ బట్లర్‌ ఔట్‌ రాజస్తాన్‌ విజయవకాశాలు దెబ్బతీసింది. మ్యాచ్ అనంతరం అశ్విన్ తన మన్కడింగ్ ఔట్‌ను సమర్ధించుకోవడం విశేషం.

Story first published: Thursday, March 28, 2019, 16:03 [IST]
Other articles published on Mar 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X