'ఐదో వన్డే మాదే'.. భారత్ బౌలింగ్ అర్థమైపోయింది, గెలుపును కొనసాగిస్తాం

Posted By: Subhan
Appreciating the calmness of Andile Phehlukwayo

హైదరాబాద్: 'భారత జట్టు ఆటగాళ్లు బ్యాట్స్‌మెన్‌ల కంటే బౌలర్లనే నమ్ముకున్నారని తెలిసిపోయింది. మాకు ఆ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలిసింది' ఈ మాటలు అంటోంది దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండిలె ఫెలుక్వాయా. భారత జట్టు వ్యూహం అర్థంకాక మూడు వన్డేల్లో పరాజయానికి గురైయ్యామని తెలిపాడు. ఇక ఆ పొరబాటు పునరావృతం కాకూడదని నాలుగో వన్డే జాగ్రత్తగా ఆడి గెలిచామన్నాడు.

భారత్‌తో ఐదో వన్డే కోసం దక్షిణాఫ్రికా మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోందని ఫెలుక్వాయో తెలిపాడు. 'మొదటి మూడు మ్యాచుల్లో చేసిన తప్పులను నాలుగో వన్డేలో పునరావృతం కాకుండా చేశాం. అంతేకాదు భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్‌దీప్‌లను ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాం' అని ఫెలుక్వాయో వివరించాడు.

మా ఫోకస్ అదే:
ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఐదో వన్డే మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫెలుక్వాయో మాట్లాడుతూ..'ప్రస్తుతం మా జట్టు ఫామ్‌ను అందుకుంది. జొహానెస్‌బర్గ్‌లో జరిగిన నాలుగో వన్డే ద్వారా సాధించిన విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నాలుగో వన్డేలో విజయానికి మేము పూర్తిగా అర్హులం. మా ఆటగాళ్లు నెట్స్‌లో ఎంతో కష్టపడ్డారు. భారత మణికట్టు స్పిన్నర్లను ఎదుర్కొనడంలో విజయవంతం అయ్యాం. ఇప్పుడు బంతిని చూడటం.. దాన్ని ఎదుర్కోవడం పైనే మా దృష్టి' అని ఫెలుక్వాయో తెలిపాడు.

బౌలింగ్ ఇలా చేస్తాం:
అనంతరం మైదానం గురించి మాట్లాడుతూ..'వాండరర్స్‌ పిచ్‌కు ఈ పిచ్‌కు చాలా తేడా ఉంది. పిచ్‌ను పరిశీలించాం. ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ధోనీ లాంటి వాళ్లకు బౌలింగ్‌ వేసే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. వీలైనంత వరకు డాట్‌ బాల్స్‌ వేసేందుకే ప్రయత్నించాలి' అని పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 13:14 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి