న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇష్టపడేవారితో సంతోషంగా ఉండండి.. అనుష్క శర్మ భావోద్వేగ సందేశం!!

Anushka Sharma shared an emotional post about caring for one’s parents in difficult times

ముంబై: బాలీవుడ్‌ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ అభిమానులను ఉద్దేశించి ఓ భావోద్వేగ సందేశం పోస్ట్ చేసారు. ప్రజలంతా తమ ఆప్తులతో ఈ కష్టసమయాల్ని(లాక్‌డౌన్‌) ఆస్వాదించాలని కోరారు. మంగళవారం అనుష్క శర్మ ఓ ట్వీట్‌ చేస్తూ.. తన తల్లిదండ్రులు, భర్త విరాట్ కోహ్లీతో కలిసి మోనోపలి ఆడుతున్న ఫొటో పంచుకున్నారు. క‌రోనా వైర‌స్ కారణంగా అనుకోని విశ్రాంతి ల‌భించ‌డంతో.. కుటుంబంతో గ‌డుపుతున్న విరాట్ కోహ్లీ కొత్త కొత్త ఆట‌లు ఆడుతున్నాడు.

కరోనాపై పోరుకు సునీల్ గవాస్కర్‌ భారీ విరాళం!!కరోనాపై పోరుకు సునీల్ గవాస్కర్‌ భారీ విరాళం!!

మోనోపాలీ ఆడుతున్న విరుష్క జోడీ:

మోనోపాలీ ఆడుతున్న విరుష్క జోడీ:

మోనోపాలీ ఆడుతున్న పోటోను పోస్ట్ చేసిన అనుష్క శర్మ.. ఈ ఆట‌లో ఎవ‌రు గెలిచారో తెలుసా? అని వ్యాఖ్య జోడించారు. దీంతో పాటు అభిమానులను ఉద్దేశించి ఒక భావోద్వేగ సందేశం కూడా పోస్టు చేశారు. 'జీవితాన్ని ప్రత్యేకంగా ఎలా తీసుకెళ్లాలనే విషయం మన తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటాం. ఎలా నడవాలి, ఎలా తినాలి, సమాజంలో ఎలా మెలగాలి, ఈ ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయాలు కూడా ఇంట్లోనే నేర్చుకుంటాం. ప్రాథమిక దశలో మనలో అలవరపడిన ఆ లక్షణాలే జీవితాంతం మనపై ప్రభావం చూపుతాయి' అని ట్వీటారు.

ఆత్మీయులను జాగ్రత్తగా చూసుకోవాలి:

ఆత్మీయులను జాగ్రత్తగా చూసుకోవాలి:

'ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ ప్రపంచం అనిశ్చితిలో ఉంది. నాకు తెలిసి ఈపాటికే మీలో చాలా మంది మీ కుటుంబ సభ్యులతో ఓదార్పు, ఆప్యాయత పొంది ఉంటారు. అందరూ ఇంట్లోనే ఉండి తమ ఆత్మీయులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయాన్ని మొత్తం వాళ్లతో ఆస్వాదించాలి. ఆప్యాయులతో కలిసి నవ్వడం, సంతోషంగా ఉండడం, ప్రేమను పంచుకోవడం, అపార్థాలను తొలగించుకోవడం లాంటివి చేయాలి. అందరితోనూ మంచి అనుబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. తమ జీవిత లక్ష్యాలను పంచుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన రేపటి కోసం ప్రార్థించాలి' అని బాలీవుడ్‌ నటి సూచించారు.

 సాధారణ పరిస్థితులు రావాలి:

సాధారణ పరిస్థితులు రావాలి:

'మనమంతా విపత్కర పరిస్థితులను చూశాం. చాలా మంది ఇంకా దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు భవిష్యత్‌లో గుణపాఠంలా నిలవాలి. రాబోయే రోజుల్లో మనమంతా ఇదివరకటిలా జీవించే సాధారణ పరిస్థితులు రావాలి' అని అనుష్క ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌పై పోరుకు విరుష్క జోడీ పీఎం కేర్స్‌కు భారీ విరాళం అందజేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా విరుష్క జోడీ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఆమెతో ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు:

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ... పెళ్లైనప్పటి నుంచి మేమిద్దరం ఒకేచోట ఇన్ని రోజులు కలిసి ఉండటం ఇదే తొలిసారి. ఒకేసారి ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు. క్రికెట్, సినిమాలతో ఇద్దరం బిజీగా ఉండేవాళ్లం. ఇప్పుడు కాస్త వింతగా ఉంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించాలనుకోవడం సరికాదు. కానీ.. అదే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇవి కఠిన రోజులు' అని అన్నాడు.

Story first published: Wednesday, April 8, 2020, 8:28 [IST]
Other articles published on Apr 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X