న్యూ ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ప్రేయసినే ప్రేమించి పెళ్లాడాడు. పెళ్లి జరగకముందు చెట్టాపట్టలేసుకుని తరచూ సోషల్ మీడియా వేదికగా కనిపించే కోహ్లీ.. అనుష్కలు మరో సారి వార్తల్లో నిలిచారు. పరోక్షంగా తన భార్య అనుష్క శర్మను అందాన్ని పొగిడేస్తున్నాడు విరాట్.. ఈ క్రమంలోనే తన భార్య అనుష్క శర్మ వార్డ్‌రోబ్‌ను రెయిడ్ చేయాలని ఉందని అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
ఇటీవల కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో తన భార్యకున్న ఫ్యాషన్స్ సెన్స్ గురించి మాట్లాడాడు. 'నాకు అనుష్క వార్డ్‌రోబ్‌ను రెయిడ్ చేయాలని ఉంది. ఎందుకంటే ఆమె చాలా స్టైలిష్‌గా ఉంటుంది. నన్ను కూడా స్టైల్‌గా ఉండేలా రెడీ చేస్తుంది. అభిమానులు నేను హ్యాండ్సమ్‌గా ఉంటానని అంటుంటారు. అందుకు కారణం అనుష్కే. ఆమె ఇంత స్టైలిష్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసుకోవాలని ఉంది' అని వెల్లడించాడు కోహ్లీ.
View this post on InstagramA post shared by Virat Kohli (@virat.kohli) on Sep 23, 2018 at 6:17am PDT
ఇటీవల భారత ప్రభుత్వం తరఫున ఖేల్ రత్న అవార్డును అందుకున్న విరాట్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడప్పుడూ క్రికెట్ గురించి తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంటూ ఉంటాడు. మరోపక్క తన దుస్తుల బ్రాండ్ అయిన 'రాన్' నుంచి 'ట్రైలర్ ది మూవీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవల వెల్లడించాడు.
View this post on InstagramA post shared by Virat Kohli (@virat.kohli) on Jul 19, 2018 at 9:20am PDT
కాగా, ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా ఆడిన దుబాయి పర్యటన .. ఆసియా కప్‌లో కోహ్లీ పాల్గొనలేదు. జట్టుకు నాయకత్వం వహించేందుకు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ. అనుకూల ఫలితాలనే సాధించింది. శుక్రవారంతో ముగిసిన ఈ టోర్నీ తర్వాత టీమిండియా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ జట్టులో మళ్లీ స్థానం దక్కించుకున్న కోహ్లీ.. కెప్టెన్సీ వహించి జట్టును నడిపించనున్నాడు.