న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఫౌండేషన్ తొలిసారి: 'కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌' రేసులో కుంబ్లే

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే 'కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌' రేసులో ఉన్నారు. భారత్‌లోని స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌ని గౌరవించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సారి ఆర్పీ-ఎస్‌జీ గ్రూపు, విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌ కలిసి సంయుక్తంగా ఈ అవార్డుని అందజేయనున్నాయి.

నవంబర్ 11న ముంబైలో విజేతలను ప్రకటించిన అవార్డులను అందజేయనున్నారు. బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌, టెన్నిస్‌ క్రీడాకారుడు మహేశ్‌ భూపతి, పీటీ ఉష, షూటర్‌ అంజలి భగతవత్‌, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్‌ హాలప్పల జ్యూరీ బృందం విజేతలను ఎంపిక చేయనుంది.

మొత్తం 8 విభాగాల్లో అవార్డులను అందజేయనున్నారు. ఇందులో స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఉంది. ఈ అవార్డు కోసం క్రికెటర్లు పుజారా, అశ్విన్‌, హార్దిక్‌ పాండ్యా, దీప్తి శర్మ, మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఒలింపిక్‌ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్‌, కబడ్డీ ఆటగాడు పర్దీప్ నర్వాల్‌, ఫుట్‌బాల్‌ కెప్టెన్ సునీల్‌ చెత్రి, హాకీ స్టార్‌ రూపీందర్‌ పాల్‌ సింగ్‌ పోటీ పడుతున్నారు.

Anil Kumble in the mix for Coach of the Year in first Indian Sports Honours

క్రికెట్‌‌తో పాటు హాకీ, చదరంగం, అథ్లెట్స్‌, టెన్నిస్‌ ఇలా పలు విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. కాగా, కోచ్‌ పదవి రేసులో అనిల్‌ కుంబ్లేతో పాటు బిశ్వేశ్వర్‌ నంది(జిమ్నాస్టిక్స్‌), బల్వన్‌ సింగ్‌(కబడ్డీ), హరీందర్‌ సింగ్‌(హాకీ), విజయ్‌ దవేచ(గోల్ఫ్‌) పోటీ పడుతున్నారు.

ఎమర్జెంగ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం అదితి అశోక్ (గోల్ఫ్), రితూ ఫోగట్ (రెజ్లింగ్), స్మృతి మందాన (క్రికెట్)లు పోటీ పడుతున్నారు. ఇక, ఎమర్జెంగ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రామ్ కుమార్ రామనాథన్ (టెన్నిస్), సమీర్ వర్మ (బ్యాడ్మింటన్), విదిత్ సంతోష్ గుజరాతీ (చెస్)లు పోటీ పడుతున్నారు.

ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని బుధవారం కోల్‌కతాలోని ది ఒబెరాయ్ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుల్లెల గోపిచంద్‌, మహేశ్‌ భూపతి, పీటీ ఉష, షూటర్‌ అంజలి భగతవత్‌, అర్జున్‌ హాలప్పలు హాజరయ్యారు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X