|
పెళ్లి ముందు 2 తర్వాత 7 అంతే
ఈ విషయం గురించి కోహ్లీ, అనుష్క ముందుగానే చర్చించుకున్నామని తెలిపారు. నా జీవితంలో పనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంతంటే నా పెళ్లికి ముందు రెండ్రోజులు కూడా సినిమా షూటింగ్‌లోనే ఉన్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుని మళ్లీ వారం విరామం తీసుకుని సూయీ దాగా షూటింగ్‌కు వెళ్లిపోయిందట. సమయంతో పాటు పరుగులు పెడుతూ షూటింగ్‌లతో బిజీగా ఉండటంతోనే జీవితం పూర్తయిపోతోంది. అని వివరించారు.
|
పని, వైవాహిక జీవితం రెండింటినీ
మరి పని, వైవాహిక జీవితం రెండింటినీ ఎలా సమన్వయపరుచుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు 'జీవితంలో దేనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామనేది ముఖ్యం. ఇది నా జీవితం ఇంకా నా వ్యక్తిగత జీవితం. రెండూ కావాలసినవే. అందుకనే రెండూ సమానంగా మేనేజ్ చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. దానిని చక్కగా నెరవేరుస్తున్నాను కూడా.
|
తొలి వివాహ వార్షికోత్సవం ఆస్ట్రేలియాలో
అనుష్క, కోహ్లీల తొలి వివాహ వార్షికోత్సవం ఆస్ట్రేలియాలో జరుపుకుంటున్నారు. టీమిండియా ఆసీస్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అనుష్క శర్మనే అక్కడికి వెళ్లనుంది. ఈ ప్రత్యేక ఈవెంట్ కోసం అనుష్క కొన్ని నెలల ముందుగానే ప్లాన్ చేసుకున్నారట. దాని కోసం జీరో టీమ్‌కు ముందుగానే సమాచారమిచ్చి ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం.