న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ..

Ambati Rayudu insists India can win Asia Cup without Virat Kohli

హైదరాబాద్: ఆసియా కప్‌లో భాగంగా మరో రెండు రోజుల్లో పోటీకి దిగనున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ ఆసియా కప్ టోర్నీలో సాధించిన రికార్డుల గురించి ఓసారి విశ్లేషిస్తే.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ క్రీజులో నిలిస్తే విధ్వంసం సృష్టిస్తాడు. బ్యాటింగ్‌ చేయడం ఇంత తేలికా అన్నట్టు ఆడతాడు. ఛేదనలో తనను మించిన మొనగాడు లేడని ఇప్పటికే చాటి చెప్పాడు.

3 మ్యాచ్‌లలోనే ఏకంగా 357 పరుగులు:

3 మ్యాచ్‌లలోనే ఏకంగా 357 పరుగులు:

ఆసియా కప్‌-2012లో అతడి బ్యాటింగ్‌ అసాధారణం. మూడు మ్యాచ్‌లలోనే ఏకంగా 357 పరుగులు సాధించాడు. అదీ 119 సగటు, 102 స్ట్రైక్‌రేట్‌తో. ఇక వన్డేల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 సైతం ఈ టోర్నీలో నమోదు చేశాడు. మొత్తం 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించాడు. విరాట్ రాణించి.. టీమిండియాను గెలిపించిన సందర్భాలు మచ్చుకు..

 వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 205:

వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 205:

టీమిండియా తొలి మ్యాచ్‌ శ్రీలంకతో జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 19 పరుగులకే సచిన్‌ వికెట్‌ చేజార్చుకుంది. వన్‌ డౌన్లో వచ్చిన వచ్చిన కింగ్‌ కోహ్లీ సెంచరీ సాధించాడు. 120 బంతుల్లో 7 బౌండరీలతో 108 పరుగులు చేశాడు. మరోవైపు గంభీర్‌ (100) సైతం సెంచరీ బాదేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. దీంతో భారత్‌ 304/3 పరుగులు చేసింది. ఛేదనలో తడబడ్డ లంక 254 పరుగులకు ఆలౌట్‌ అయింది.

మాస్టర్‌తో కలిసి విరాట్‌ 148 భాగస్వామ్యం:

మాస్టర్‌తో కలిసి విరాట్‌ 148 భాగస్వామ్యం:

రెండో మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో జరిగింది. భారత్‌ 5 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 82 బంతుల్లో (66)5 ఫోర్లతో హాఫ్ సాధించాడు. సచిన్‌ (114) సెంచరీ సాధించాడు. మాస్టర్‌తో కలిసి విరాట్‌ 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఛేదనలో బంగ్లా సమష్టిగా ఆడి టీమిండియాకు షాకిచ్చింది.

22 బౌండరీలు, సెంచరీతో 183:

22 బౌండరీలు, సెంచరీతో 183:

తనకెంతో ఇష్టమైన ఛేదనలో విరాట్‌ కోహ్లీ చెలరేగి ఆడాడు. పాక్‌పై కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత పరుగులు నమోదు చేశాడు. 148 బంతులు ఆడిన అతడు 22 బౌండరీలు, ఒక సెంచరీతో ఏకంగా 183 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 318 వద్ద ఔటయ్యాడు. లేదంటే అతడి ఖాతాలో డబుల్ సెంచరీ నమోదయ్యేది. సచిన్‌తో రెండో వికెట్‌కు 133, రోహిత్‌ శర్మతో మూడోవికెట్‌కు 172 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ టోర్నీలో భారత్‌ ఫైనల్‌ చేరలేదు.

Story first published: Sunday, September 16, 2018, 16:02 [IST]
Other articles published on Sep 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X