న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇతడిని ఎందుకు వదిలేశామా అని: ఐపీఎల్‌లో ఎవరా నలుగురు?

By Nageshwara Rao
Ambati Rayudu, Chris Gayle, KL Rahul superb performance in ipl 2018

హైదరాబాద్: ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఆయా ప్రాంజైలు సొంత జట్లకు చెందిన ఆటగాళ్లపై ఆసక్తి కనబర్చని సంగతి తెలిసిందే. ఆసక్తి కనబర్చక పోవడం అంటే ఈసారి నువ్వు మాకు అక్కర్లేదు అని నేరుగా చెప్పేశాయన్నమాట.

దీంతో వేలంలో మరో జట్టు వారిని సొంతం చేసుకోవడంతో తామెంటో నిరూపించుకోవాలనే కసితో ఆడుతున్నారు. గత సీజన్లలో ఆడిన జట్టు యాజమాన్యం వద్దనుకుంటే ఈ సీజన్‌లో సొంతం చేసుకున్న జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ చెలరేగుతున్నారు.

అంతేకాదు కొత్త జట్లకు ఓ వరంలా మారుతున్నారు. దీంతో ఇతగాడిని ఎందుకు వదిలేశామా అని పాత జట్లు చింతించేలా చేస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో జట్టు మారిన తర్వాత అద్భుతమైన ప్రదర్శన చేస్తోన్న ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దాం....

అంబటి రాయుడు

అంబటి రాయుడు

ఈ జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు అంబటి రాయుడు. ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. చాలా ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడిన అంబటి రాయుడిని ఈ సీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో కొనుగోలు చేయలేదు. దీంతో చెన్నై యాజమాన్యం రాయుడిని వేలంలో రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసింది. టాప్‌ ఆర్డర్లో ఆడించింది. చెన్నై తనపై పెట్టిన నమ్మకాన్ని రాయుడు వమ్ము చేయలేదు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 79, 82, 46, 41 పరుగులతో చెన్నై జట్టుని విజయతీరాలకు చేర్చాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 370 పరుగులతో టోర్నీ టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్

అరంగేట్ర వన్డేలో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌. జాతీయ జట్టులోకి వచ్చీరావడంతోనే తనదైన ముద్ర వేశాడు. గత రెండు సీజన్లలో బెంగళూరు తరపున ఆడిన రాహుల్‌ ప్రస్తుత సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్‌ని పంజాబ్ జట్టు వేలంలో రూ.11 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంత ధర పలకడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగినట్లుగానే బరిలో దిగిన మొదటి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధసెంచరీ (14 బంతుల్లో) చేసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కూడా నిలకడగా రాణిస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌ల్లో 170.70 స్ట్రైక్‌ రేట్‌తో రాహుల్‌ 268 పరుగులు చేశాడు.

 క్రిస్ గేల్

క్రిస్ గేల్

ఐపీల్‌కు పరిచయం అక్కర్లేని పేరు క్రిస్ గేల్. ఐపీఎల్‌ మొదటి రెండు సీజన్లలో కోల్‌కతా తరపున ఆడిన గేల్‌.. ఆ తర్వాత బెంగళూరుకు మారాడు. కొన్నేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఐపీఎల్‌లో ఆడాడు క్రిస్ గేల్. వయసు మీద పడడం, ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండడంతో వేలంలో క్రిస్ గేల్‌ను తీసుకోవడానికి ఏ జట్టు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే చివర్లో పంజాబ్‌ అతణ్ని కనీస ధర రూ.2 కోట్లకే సొంతం చేసుకుంది. పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గేల్‌కు చోటు కల్పించలేదు. మూడో మ్యాచ్‌లో బరిలో దిగిన గేల్‌.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 126 యావరేజితో 252 పరుగులు చేశాడు.

ట్రెంట్ బౌల్ట్

ట్రెంట్ బౌల్ట్

న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉన్నప్పటికీ.... తాను మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. గత సీజన్లో కోల్‌కతా తరపున ఆడిన బౌల్ట్‌ అంచనాల మేర రాణించలేకపోయాడు. దాంతో వేలంలో కోల్‌కతా అతడిని కొనుగోలు చేయలేదు. అయితే ఢిల్లీ ట్రెంట్ బౌల్ట్‌ను రూ.2.2 కోట్లకు సొంతం చేసుకుంది. సీజన్‌ మొదట్లో తడబడిన బౌల్ట్‌ ఆ తర్వాత మంచి లయ, పేస్‌తో వికెట్లు తీస్తున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌ల్లో 24.90 యావరేజితో 11 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

Story first published: Wednesday, May 2, 2018, 16:53 [IST]
Other articles published on May 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X